ఎమ్మెల్యే మద్దిపాటి ఆధ్వర్యంలో
పరమేశు బయోటెక్ వారు వైద్యశాలకు కోటి రూపాయల ఆర్థిక సహాయం.
తూర్పుగోదావరిజిల్లా గోపాలపురం నియోజకవర్గం దేవరపల్లి మండలం మార్చి 12:సేవాదృక్పథంతో పీ,పోర్ పథకంలో భాగంగా ప్రభుత్వ వైద్యశాలకు అభివృద్ధికి పరమేశు బయోటెక్ లిమిటెడ్ చైర్మన్ తేతలి ఉపేందర్ రెడ్డి, మేనేజింగ్ డైరెక్టర్ ఆనంద స్వరూప్ కోటి రూపాయలు విరాళం అందజేయడం ఎంతో అభినందనీయమని గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు అన్నారు. ఈ సందర్భంగా మద్దిపాట్టి వెంకటరాజు మాట్లాడుతూ గతంలో కూడా పరమేశు బయోటెక్ కంపెనీ వారు దేవరపల్లి పంచాయతీకి చెత్త సేకరణ కొరకు ట్రాక్టర్ను ఇవ్వడం జరిగిందని అలాగే దేవరపల్లి ప్రభుత్వ వైద్యశాలకు అదనపు భవన నిర్మాణానికి కోటి రూపాయలు సహాయం చేయటం పి ఫోర్ సేవలను కూడా ప్రజలకు అందుబాటులో రావటం దేవరపల్లి గ్రామ ప్రజలుకు అదృష్టమని అన్నారు ఆరోగ్యమే మహాభాగ్యం రైతు కూలీలు శ్రామికులు అందరికీ ప్రభుత్వ వైద్యశాలల ద్వారా మెరుగైన వైద్యాలు పొందటమే కాకుండా జీవన పరిమళాలకు ఆటంకం లేకుండా ప్రజలు వైద్యశాలలు సహాయపడతాయని ఆయన అన్నారు ముందుగా భూమి పూజ అత్యంత ఘనంగా వేదమంత్రాల నడుమ శంకుస్థాపన జరిపారు జరిపారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు దాతలను కొనియాడారు ఈ కార్యక్రమానికి డిఎం.హెచ్.ఓ వైద్యశాల అధికారి స్వరూప రాణి.పార్టీ మండల అధ్యక్షులు తగేళ్ల మునీశ్వరరావు నల్లజర్ల మండల అధ్యక్షులు తాతిన సత్యనారాయణ ముళ్ళపూడి దొరాజి సుంకర వీర వెంకట దుర్గారావు గన్నమని హరికృష్ణ ఆండ్రు అనిల్.కొర్లపాటి రామచంద్రమూర్తి.బళ్ళ సూరిచక్రం కాట్రు భీమరాజు బాదంపూడి ఇందిరా గద్దె రమాదేవి తదితరులు పాల్గొన్నారు


