జంగారెడ్డిగూడెం లో ట్రాఫిక్ నియమాలపై అవగాహన చర్యలు.

 జంగారెడ్డిగూడెం లో ట్రాఫిక్ నియమాలపై అవగాహన చర్యలు.



ఏలూరుజిల్లా జంగారెడ్డిగూడెం ఏఎస్పీ సుస్మిత ఆర్, ఐపీఎస్  యొక్క ఆదేశాల పై జంగారెడ్డి గూడెం ఇన్స్పెక్టర్ ఎం వి సుభాస్  ఎస్ఐ వీర ప్రసాద్, ట్రాఫిక్ ఎస్ఐ కుటుం బరావు  వారి యొక్క సిబ్బంది తో కలిసి ఏజెన్సీ ముఖద్వారమైన జంగారెడ్డిగూడెం లో ట్రాఫిక్ నియమాల పై అవగాహన చర్యలు నెంబర్ ప్లేట్ లేని వాహనాల గుర్తింపు  హెల్మెట్ వినియోగంపై దృష్టి పెట్టినారు.

జంగారెడ్డిగూడెం సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీ ఎం.వి. సుభాష్  ఎస్ఐ వీర ప్రసాద్  ట్రాఫిక్ ఎస్‌ఐ  కుటుంబరావు  తమ పోలీస్ సిబ్బంది తో కలిసి జంగారెడ్డి గూడెం పట్టణ పరిధిలో ప్రత్యేక ట్రాఫిక్ తనిఖీలు నిర్వ హించారు.

ఈ తనిఖీలలో నెంబర్ ప్లేట్ లేని ద్విచక్ర వాహనాలను గుర్తించి, సదరు వాహన యజమాను లకు నెంబర్ ప్లేట్ తప్ప నిసరిగా ఏర్పాటు చేయించారు.

అలాగే, హెల్మెట్ ధరించ కుండా వాహనాలు నడుపు తున్న వారిపై జరిమానాలు విధించకుండా వారి ద్వారా తక్షణమే 43 హెల్మెట్లు కొనుగోలు చేయించి సురక్షిత ప్రయాణంపై అవగాహన కల్పించారు.

ఈ సందర్భంగా  పోలీస్ అధికారులు మాట్లాడుతూ వాహన దారులు తప్పనిసరిగా ట్రాఫిక్ నియమ నిబంధనలు పాటిం చాలని, తమ స్వంత భద్రతతో పాటు ఇతరుల ప్రాణాలను కాపాడు కోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని తెలిపారు.

అతి వేగం, నిర్లక్ష్యం ప్రాణాలకు ప్రమాద కరమని,హెచ్చరిస్తూ వేగం వద్దు  ప్రాణం ముద్దు  అనే నినాదాన్ని ప్రతి వాహనదారులు గుర్తుంచుకోవాలని విజ్ఞప్తి చేశారు.

ట్రాఫిక్ నియమాల ను పాటిస్తూ సురక్షిత మైన ప్రయాణాలు చేయాలని జంగారెడ్డి గూడెం ఇన్స్పెక్టర్  ఎస్ఐ వీర ప్రసాద్, ట్రాఫిక్ ఎస్ఐ కుటుంబరావు, పోలీస్ శాఖ ప్రజలకు పిలుపు నిచ్చింది. ఈ కార్యక్రమంలో మోటార్ వెహికిల్ ఇన్స్పెక్టర్  పాల్గొన్నారు.