*స్వచ్ఛ రథం సేవలు వినియోగించుకోండి
నూజివీడు, (మంజీర గళం) ప్రతినిధి,
ఏలూరు జిల్లా నూజవీడు మండలం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మద్దాయి కుంట హై స్కూల్ నందు గురువారం స్వచ్చ రథం విచ్చేసింది రాష్ట్ర ప్రభుత్వం మండలానికి ఒక స్వచ్ఛ రథం ఏర్పాటు చేసి ప్రతిరోజు గ్రామం చొప్పున, ప్రతి గురువారం పాఠశాలల సందర్శన ఏర్పాటు చేయవలసిందిగా ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ఈ స్వచ్ఛరదం పనిచేస్తుందని నిర్వాహకుడు బూరి సింహాచలం నాయుడు తెలిపారు పాఠశాల ప్రధానోపాధ్యాయులు దారపురెడ్డి భాస్కర్ రావు మాట్లాడుతూ వ్యర్ధాలను ఎక్కడపడితే అక్కడ పడవేయ కుండా, స్వచ్ఛ రథం నిర్వాహకులుకు అందించడం ద్వారా విద్యార్థులకు ఉపయోగపడే ఎన్నో పెన్సిల్, పెన్ను, ఎక్సమ్ పాడ్,జామెండ్రి బాక్స్ తదితర స్టేషనరీ సామాగ్రిని పొందవచ్చు అని, లేదా సరుకులు, డబ్బులు కావాలన్నా పొందవచ్చునని విద్యార్థులకు వివరించారు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ స్వచ్ఛ రథం సేవలను అన్ని గ్రామ ప్రజలు ఉపయోగించుకుని వ్యర్థాలను రోడ్లపై పడేయకుండా, పరిసరాల పరిశుభ్రతకు అందరూ సహకరించడం ద్వారా స్వచ్ఛ ఆంధ్ర ప్రదేశ్ సాధించబడుతుందని, తద్వారా ఆనంద ఆంధ్రప్రదేశ్ సాధించగలమని అందుకు విద్యార్థులు తల్లిదండ్రులు గ్రామస్తులు అందరూ ఈ స్వచ్ఛ రథం వినియోగం పట్ల అవగాహన కలిగి ఉండాలని, విద్యార్థులకు తెలపడం ద్వారా తల్లిదండ్రులు గ్రామస్తుల చైతన్యవంతులై ఈ కార్యక్రమం విజయవంతం అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.


