మోడీ పెంచిన గ్యాస్ ధరలు తగ్గించాలి!

 మోడీ పెంచిన గ్యాస్ ధరలు తగ్గించాలి! 




నూజివీడు నియోజక వర్గం చాట్రాయి మండ లం చిత్తపూరు గ్రామం లో కేంద్రలోని బిజేపి మోడీ ప్రభుత్వం పెంచి న గ్యాస్ ధరలు తగ్గిం చాలని సిపిఐ ఎంఎల్ లిబరేషన్ అఖిల భారత ప్రగతిశీల మహిళా సంఘం ఆధ్వర్యంలో మంగళ వారం గ్రామంలో రాస్తారోకో నిర్వహి చారు.ధరలను నియంత్రిస్తామని గద్దెనెక్కిన రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు గ్యాస్ బండకు 60 రూపాయ లు పెంచి ప్రజలపై  భారం వేయడం ద్వారా సామాన్యుడి నడ్డి విరిగిందని రాష్ట్ర కార్యవర్గ సభ్యులు. డి హరినాథ్ విమర్శించా రు. కూటమిపాలకులు కేంద్రం గ్యాస్ ధరలు పెంచు తుంటే నిమ్మకు నీరెత్తి నట్లు వ్యవహరి స్తున్నారనిఆరోపించారు. రాష్ట్రంలో ప్రజల సమస్యలు పట్టించు కోకుండా తిరుపతి లడ్డు కల్తీ అయిందని అసెంబ్లీ సమావేశాల్లో విలువైన సమయాన్ని వృధాచేస్తున్నారన్నారనీ, నిత్యావసర వస్తు వుల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయని విమర్శించారు.చిత్తపూరు గ్రామంలోని సమస్య లపై రాష్ట్ర గృహ నిర్మా ణ సమాచార శాఖ మంత్రి మంత్రి కొలుసు పార్థసారథివారిని కలవ నున్నట్లు చాట్రాయి మండల కార్యదర్శి కలపాల వెంకటేశ్వర రావు తెలిపారు. ఈ కార్యక్రమంలో లిబరేష న్ జిల్లా కమిటీ సభ్యు లు చాట్ల బాబురావు, వేముల బక్కయ్య, భవాని, కొత్తపల్లి ప్రసాద్, సోమేశ్వరరావు పుల్లారావు, నారాయణ రామారావుతదితరులు పాల్గొన్నారు.