రక్తదానం.. ప్రాణదానంతో సమానం
ఆగిరిపల్లి,మంజీరగళం ప్రతినిధి:
ఆగిరిపల్లి : రక్తదానం- ప్రాణదానంతో సమానమని హెచ్ ఫౌండేషన్ కో-చైర్మన్ మరియు మేనేజింగ్ ట్రస్టీ మొగులూరి ఎలిజబెత్ రాణి తెలిపారు. ఆగిరిపల్లి మండలం నెక్కలం గొల్లగూడెం లోని కుశలవ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్‌లో హెచ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సహకారంతో సోమవారం "రక్తదానం – జీవనదానం” పేరుతో రక్తదాన శిబిరం నిర్వహిచారు.
ఈ కార్యక్రమంలో సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి 300 మంది రక్తదానం చేశారు.
ఈ సందర్భంగా హెచ్ ఫౌండేషన్ కో-చైర్మన్ మరియు మేనేజింగ్ ట్రస్టీ మొగులూరి ఎలిజబెత్ రాణి మాట్లాడుతూ... తల సేమియా వ్యాధితో చిన్నారులు రక్తం దొరక్క ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని అన్నారు.
రక్తదానం మహాదానం అని, సమాజంలో మరింత మంది యువత మరియు సంస్థలు ముందుకు వచ్చి స్వచ్ఛందంగా రక్తదానం చేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో డాక్టర్ మధన్ మోహన్, వారి వైద్య బృందం పాల్గొని రక్త సేకరణ ప్రక్రియను నిర్వహించారు. హెచ్ ఫౌండేషన్ టీమ్ సభ్యులు టి. రేఖ, సోఫియా, స్వర్ణకుమారి, ప్రత్యూషా, జ్యోతి కార్యక్రమంలో పాల్గొన్నారు.


