చత్రపతి శివాజీ ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థిని యూనివర్సిటీ క్రాస్ కంట్రీ లో ప్రతిభ.

 చత్రపతి శివాజీ ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థిని యూనివర్సిటీ క్రాస్ కంట్రీ లో ప్రతిభ.




ఏలూరుజిల్లా జంగారెడ్డిగూడెం స్థానిక చత్రపతి శివాజీ త్రి శతజయంతి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బి ఏ పొలిటికల్ సైన్స్ విద్యార్థిని కే కళ్యాణి ఆదికవి నన్నయ యూనివర్సిటీలో  లో నిర్వహించినటువంటి క్రాస్ కంట్రీ లో తన ప్రతిభ చూపించి నాలుగవ స్థానాన్ని కైవసం చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి కళాశాల ప్రిన్సిపల్ డా.ఎన్ ప్రసాద్ బాబు మాట్లాడుతూ ముందుగా కళాశాల విద్యార్థిని కే.కళ్యాణికి అభినందనలు తెలియజేశారు. కళ్యాణి క్రాస్ కంట్రీలో ఆల్ ఇండియా లెవెల్ లో పాల్గొనటానికి అవకాశం వచ్చిందని మరొకసారి మన కళాశాల ప్రతిభ ఆల్ ఇండియా లెవెల్ లో మంగుళూరులో నిర్వహించే పోటీలలో కనబరిచే అవకాశం కళ్యాణి ద్వారా కలిగిందని అన్నారు. ఇలా పోటీలలో పాల్గొనే విద్యార్థులకు చదువుతోపాటు తమ నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవడానికి కూడా ప్రత్యేక సమయం కేటాయించాల్సి వస్తుందని విద్యార్థులు శ్రమించి ఈ విధంగా పోటీలలో పాల్గొనడం కళాశాల గర్వించదగ్గ విషయం అని అన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల ఫిజికల్ డైరెక్టర్ నిట్టా వినయ్ మాట్లాడుతూ పది కిలోమీటర్ల  క్రాస్ కంట్రీలో పాల్గొనటానికి కళ్యాణికి 54 నిమిషాల సమయం పట్టిందని ఈ సమయం కన్నా ముందుగానే క్రాస్ కంట్రీ ని పూర్తి చేయటానికి కూడా అవకాశాలు ఉన్నాయని వాటికి కళాశాల తరుపున ప్రత్యేక శిక్షణ ఇస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల ఐ క్యూ ఏ సి కోఆర్డినేటర్ డా. ఎం. మధు, అధ్యాపకులు డా. కే. ఉత్తమ్ సాగర్, బి. అశోక్, ఎం శ్రీనివాస రావు ఇతర అధ్యాపక అధ్యాపకేతర సిబ్బంది కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు.