అన్నదాత సుఖీభవ – పీఎం కిసాన్ పథకంలో భాగంగా మూడో విడత నిధులను
పోలవరం నియోజకవర్గం పరిధిలోని ఏడు మండలాలకు చెందిన రైతులకు మొత్తం 19 కోట్ల 40 లక్షల రూపాయల విలువైన చెక్కులను పోలవరం శాసనసభ్యులు చిర్రి బాలరాజు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే చిర్రి బాలరాజు మాట్లాడుతూ, రైతుల సంక్షేమమే కూటమి ప్రభుత్వానికి ప్రధాన లక్ష్యమని తెలిపారు. రైతులు ఆర్థికంగా బలపడేలా ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తోందన్నారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన పీఎం కిసాన్ పథకం ద్వారా రైతులకు నేరుగా ఆర్థిక సహాయం అందుతున్నదని పేర్కొన్నారు.
అదే విధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా రైతులకు తోడ్పాటుగా నిలుస్తూ అన్నదాత సుఖీభవ వంటి కార్యక్రమాల ద్వారా రైతుల అభివృద్ధికి కట్టుబడి ఉందన్నారు.
పోలవరం నియోజకవర్గంలోని ప్రతి రైతుకు ప్రభుత్వ పథకాల లబ్ధి చేరేలా తాను కృషి చేస్తున్నానని ఎమ్మెల్యే తెలిపారు. రైతులు ఆధునిక వ్యవసాయ పద్ధతులను అవలంబించి మంచి దిగుబడులు సాధించాలని, వ్యవసాయ శాఖ అధికారులు రైతులకు అవసరమైన సాంకేతిక సలహాలు అందించాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో టైగర్ చైర్మన్ బొరుగుల శ్రీనివాసులు, అగ్రికల్చర్ ఏడి బుచ్చిబాబు, ఏవోలు పోసే రావు బాలాజీ, బీజేపీ గిరిజన మోర్చా నాయకురాలు బొరగం వెంకటలక్ష్మి, జనసేన మండల అధ్యక్షులు గునపర్తి చిన్ని, టీడీపీ అధ్యక్షుడు మంగిన కొండ, ఐటీ వింగ్ కోఆర్డినేటర్ ఏ.వి, ఏ.ఎం.సి డైరెక్టర్ స్వాతి, కూటమి నాయకులు కరిబెండి నాగరాజు, పాదం ప్రసాద్, చీకట్ల సాయి, తెలగం శెట్టి రాంప్రసాద్, సీత, కొణతాల ప్రసాద్ తదితర కూటమి నాయకులు, అధికారులు పాల్గొన్నారు.


