ఏలూరుజిల్లా జంగారెడ్డిగూడెం చత్రపతి శివాజీ త్రి శతజయంతి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో కళాశాల ప్రిన్సిపల్ డా. ఎన్. ప్రసాద్ బాబు అధ్యక్షతన జంతుశాస్త్ర, వృక్షశాస్త్ర విభాగంలు ఆధ్వర్యంలో పేరెంట్ టీచర్ మీటింగ్ ను నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ డా. ఎన్.ప్రసాద్ బాబు మాట్లాడుతూ విద్యార్థుల విద్యా ప్రగతికి, వ్యక్తిత్వ వికాసానికి అత్యంత కీలకము తల్లిదండ్రులని అని విద్యార్థుల చదువులో బలహీనతలు, ప్రవర్తనా తీరు మరియు సర్వతోముఖాభివృద్ధిని చర్చించడానికిఉపాధ్యాయులు తల్లిదండ్రులకు మధ్య మీటింగ్ ను నిర్వహించడం జరుగుతుందని పేరెంట్స్ మీటింగ్ ప్రధాన ఉద్దేశం విద్యార్థుల భవిష్యత్తు అని అన్నారు. జంతుశాస్త్ర విబాగ అధిపతి ఆర్. విజయ్ దీపిక మాట్లాడుతూ ఏ సబ్జెక్టులకు ఎక్కువ ప్రాధాన్యత చూపుతున్నారు , ఎక్కడ బలహీనంగా ఉన్నారో ఉపాధ్యాయులతో చర్చించి నేరుగా తెలుసుకోవచ్చు అని,చదువులో వెనుకబడినా, లేదా ప్రవర్తనలో మార్పులున్నా, వాటికి కారణాలను ఉపాధ్యాయులతో కలిసి చర్చించి పరిష్కార మార్గాలు కనుగొనటానికి పేరెంట్స్ మీటింగ్ నిర్వహిస్తామని కావున విద్యార్థుల తల్లిదండ్రులు దీనిని ఒక బాధ్యతగా స్వీకరించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల ఐక్యూఎసి కోఆర్డినేటర్ డా. ఎం. మధు, తెలుగు అధ్యాపకులు డా. జి. వెంకట లాల్ వృక్ష శాస్త్ర అధ్యాపకురాలు సిహెచ్ షాలిని ఇతర అధ్యాపక అధ్యాపకేతర సిబ్బంది విద్యార్థులు పాల్గొన్నారు.


