పామాయిల్ ఫ్యాక్టరీలో ప్రమాదాల నివారణకై మాక్ డ్రిల్ నిర్వహించిన సీఐ ఎం వి సుభాష్..

 పామాయిల్ ఫ్యాక్టరీలో ప్రమాదాల నివారణకై మాక్ డ్రిల్ నిర్వహించిన సీఐ ఎం వి సుభాష్..

ఏలూరుజిల్లా జంగారెడ్డిగూడెం టౌన్ స్థానిక నవభారత్ ఆయిల్ పామ్ ఫాక్టరీ నందు మంగళవారం ఆ సంస్థ జనరల్ మేనేజర్ అంజయ్య ఆధ్వర్యంలో ఫ్యాక్టరీ సిబ్బంది కి ప్రమాదాల నివారణకై మాక్ డ్రిల్ నిర్వహించారు.ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశం లో ముఖ్య అతిథిగా విచ్చేసిన సీఐ ఎంవి. సుభాష్ కార్మికులకు ఇథనాల్ వాడకంపై పలు సూచనలు చేశారు.

ఎస్సై ఎన్.వీర ప్రసాద్ మాట్లాడుతూ ఫ్యాక్టరీలో ఎటువంటి ప్రమాదం జరిగినా స్థానిక పోలీస్ స్టేషన్ కు గానీ,112 గానీ సమాచారం అందించాలని సూచించారు.మానవత సంస్థ ప్రతినిధి ఏవీ.రమణమూర్తి, మాట్లాడుతూ ఎటువంటి ప్రమాదం జరిగినా అంబులెన్స్ ,ఇతర వైద్య సేవలకు తమ సంస్థ ను సంప్రదించాలని కోరారు.ఈ కార్యక్రమంలో ఫైర్ ఆఫీసర్ బాబూరావు,పిఆర్ ఓ ఏవీ. రాఘవరావు,కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.