పూరి గుడిసె దగ్ధమైన కుటుంబాన్ని పరామర్శించి ఆర్ధిక సాయం చేసిన కూటమి నాయకులు.

పూరి గుడిసె దగ్ధమైన కుటుంబాన్ని పరామర్శించి  ఆర్ధిక సాయం చేసిన కూటమి నాయకులు. 


 ఏలూరుజిల్లా జంగారెడ్డిగూడెం గురువారం ఉదయం జంగారెడ్డిగూడెం టౌన్  బుట్టాయగూడెం రోడ్డులో,చంద్రశేఖర ఫంక్షన్ హాల్ వద్ద, కరెంట్ షార్ట్ సర్క్యూట్ వల్ల  రొంగల సుబ్బలక్ష్మి కి చెందిన తాటాకుల పూరి గుడిసె పూర్తిగా దగ్ధమైంది, సుబ్బలక్ష్మి కి ఇద్దరు ఆడపిల్లలు , కూలిపనులు చేసుకుంటూ, ఇద్దరు ఆడపిల్లలను చదివించుకుంటుంది,ప్రమాదం గురుంచి తెలిసిన వెంటనే కూటమి నాయకులు, ప్రమాద స్థలాలకి  వెళ్లి ప్రమాదం వల్ల నష్టపోయిన సుబ్బలక్ష్మి కుటుంబాన్ని పరామర్శించారు, కూటమి తరుపున అక్షరాల Rs 40,000/ ఆర్థిక సహాయం అందించారు.తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షుడు కొండ్రెడి కిషోర్ మాట్లాడుతూ ప్రభుత్వం తరుపున రావలసిన సహాయం అందేలా శాసనసభ్యులు సొంగా రోషన్ కుమార్ దృష్టి కి తీసుకెళ్లి, త్వరగా సహాయం అందజేస్తామని తెలియజేశారు,ఈ కార్యక్రమం లో జెడ్పిటిసి  పోల్నాటి బాబ్జి,చిట్టిబోయిన రామలింగేశ్వరరావు, బొబ్బర రాజ్ పాల్ కుమార్, దాకరపు కృష్ణ మహాంకాళి రాంబాబు,వలవల తాతాజీ, ఇనగడప రామాంజనేయులు,బూరుగుపల్లి సూరిబాబు, ఉక్కుర్తి సీతారామ్,షేక్ హసీనా,గెడా సుబ్రహ్మణ్యం, బొంకూరి అనీల్,కొంచాడ ప్రసాద్,శీలం గోపి,ముప్పిడి విష్ణు,మరియూ కూటమి నాయకులు,కార్యకర్తలు  పాల్గొన్నారు.