సావిత్రిబాయి పూలే వర్ధంతి సభలో మాట్లాడుతున్నా వెలగల దుర్గారావు..
చట్టసభల్లో మహిళల ప్రాతినిధ్యం పెరగాలి
సావిత్రిబాయి పూలే కలలుగన్న మహిళ సాధికారిక సాధ్యం కావాలంటే సప్తసభల్లో మహిళలకు ప్రాతినిధ్యం పెరగాలని బిసి చైతన్య సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు వెలగల దుర్గారావు కోరారు
స్థానిక జ్యోతిరావు పూలే విగ్రహం దగ్గర జరిగిన సావిత్రిబాయి పూలే,,129 వర్ధంతి కార్యక్రమంలో దుర్గారావు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ చట్టం తీసుకువచ్చిన ఆ చట్టాలన్నీ 2019 నుండి అమల్లోకి వస్తుందని కేంద్ర ప్రభుత్వం చెప్పటం హాస్యాస్పదమని తెలిపారు మహిళా రిజర్వేషన్ బిల్లులో ఓబీసీ మహిళలకు రిజర్వేషన్లకు కల్పించకపోవడం బీసీల పట్ల ఆ పార్టీల వైఖరి తెలుపుతుంది అని అన్నారు రిజర్వేషన్లకు అతీతంగా రాష్ట్రంలో త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో మహిళలకు 33 శాతం స్థానాలే ఇవ్వాలని అన్నారు బీసీ చైతన్య సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిటికిన రమేష్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం సావిత్రిబాయి పూలే దంపతులకు భారతరత్న ఇచ్చి గౌరవించాలని అన్నారు సిపిఐ నాయకులు ఆంజనేయరాజు మాట్లాడుతూ బీసీ బాలికల గురుకుల పాఠశాలలకు సావిత్రిబాయి పూలే గురుకుల పాఠశాలలుగా పేరు పెట్టాలని కోరారు ప్రభుత్వం వారు తల్లికి వందనం పథకానికి సావిత్రిబాయి పూలే పేరు పెట్టాలని కోరారు
ఈ యొక్క కార్యక్రమానికి చిటికిన బాలగంగాధర్ తిలక్ వీసం రంగా దాస రోజు జయ శేఖర్ రేపల్లె సత్యనారాయణ జల్లపల్లి రాంబాబు గొలిశెట్టి సూర్యచంద్రన్ అంగడాల గంగాధరరావు కామేశ్వరరావు మారిశెట్టి శ్రీను మద్దిబోయిన శ్రీను తదితరులు గున్నేపల్లి సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు


