వేగం వద్దు -ప్రాణం ముద్దు : ఎస్సై చిరంజీవి


 
 వేగం వద్దు -ప్రాణం ముద్దు : ఎస్సై చిరంజీవి 

నూజివీడు /ముసునూరు :వేగం వద్దు ప్రాణం ముద్దు ఏలూరు జిల్లా, నూజివీడు నియోజకవర్గం పరిధిలో గల ముసునూరు స్టేషన్ ఎస్ఐ చిరంజీవి వారి యొక్క సిబ్బంది తో కలిసి విజిబుల్ పోలీసింగ్ మరియు హెల్మెట్ వినియోగం పై అవగాహన సదస్సు ఆదివారం నాడు నిర్వహించినారు.

నూజివీడు డిఎస్పీ కె.వి.వి.ఎన్.వి. ప్రసాద్ ఆదేశాల మేరకు, రూరల్ సీఐ కె. రామకృష్ణ యొక్క ఆధ్వర్యములో ముసునూరు ఎస్.ఐ ఎం. చిరంజీవి మరియు సిబ్బంది విజిబుల్ పోలీసింగ్ నిర్వహించడం జరిగింది.

 ఈ సందర్భంగా ఎస్సై చిరంజీవి మాట్లాడుతూ.... వాహనదారులకు రోడ్డు భద్రత, సైబర్ నేరాలపై అవగాహన కల్పిస్తూ... ప్రతి 
ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, ప్రాణా పాయం నుండి రక్షణ పొందాలని సూచించారు. అదేవిధంగా మరీ ముఖ్యంగా వేగం వద్దు ప్రాణం ముద్దు నినాదాన్ని గుర్తుంచుకోవాలని కోరారు.

ఆటోల్లో పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించకూడదని, వాహనాలను రోడ్డుపై అడ్డంగా కాకుండా ఆటో స్టాండ్‌లలోనే నిలపాలని హెచ్చరించారు.మైనర్లకు వాహనాలు ఇస్తే వారి తల్లిదండ్రులు లేదా రక్త సంబంధీకులపై కూడా కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

 అత్యవసర సమయాల్లో డయల్ 112 సేవలను ఉపయోగించుకోవాలని, సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు అవగాహన కల్పించాలని కోరారు

మీ కుటుంబ సభ్యులు మీపై ఆధారపడి ఉన్నారనే విషయాన్ని గుర్తుంచుకుని సురక్షితంగా ప్రయాణించి ప్రజల్లో భద్రతా భావాన్ని పెంపొందించడమే ఈ విజిబుల్ పోలీసింగ్ ప్రధాన ఉద్దేశ్యం అని ఎస్ఐ చిరంజీవి తెలియజేశారు.