పదవ తరగతి విద్యార్థులకు ఫాడ్స్ , పెన్నులు బహుకరణ.

 పదవ తరగతి విద్యార్థులకు ఫాడ్స్ , పెన్నులు బహుకరణ.



ఏలూరుజిల్లా జంగారెడ్డిగూడెం విద్య అనేది ఎంతో విలువైనదని, విద్య ఒకరు నుండి దోచుకోలేనిదని, సంపద లాంటిదని వాసవి క్లబ్ గోల్డ్ వనిత అధ్యక్షురాలు భూమా విజయ అన్నారు. వాసవి క్ల బ్ గోల్డ్ సీనియర్ సభ్యులు కొల్లేపర ఆనంద మాతృమూర్తి ధనలక్ష్మి జ్ఞాపకార్థం ఆయన తండ్రి కొల్లేపర కృష్ణారావు ఆధ్వర్యంలో సోషల్ వెల్ఫేర్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కోయిలగూడెం ఎస్సీ బాలికల, బాలుర పదవ తరగతి విద్యార్థిని విద్యార్థులకు పరీక్షలు రాసుకునేందుకు ప్యాడ్స్, పెన్నులు అందజేశారు. ఈ సందర్భంగా కొల్లేపర ఆనంద మాట్లాడుతూ తమ తల్లిదండ్రులు సూచించిన మార్గ నిర్దేశకత్వంలో తాము సేవా కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలియజేశారు. గో శాల చైర్మన్ ఏలూరు ఫణి కుమార్ మాట్లాడుతూ వాసవి క్లబ్ గోల్డ్ జంగారెడ్డిగూడెం, వాసవి క్లబ్  గోల్డ్ వనిత ఆధ్వర్యంలో మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వాసవి క్లబ్ గోల్డ్ జంగారెడ్డిగూడెం అధ్యక్షులు నాగసూరి బాలసుబ్రమణ్యం, కార్యదర్శి పుష్కర్, కోశాధికారి మహేష్ కుమార్, సీనియర్ సభ్యులు కొల్లేపర నారాయణ, సోలస శ్రీనివాసరావు, గుడిమెట్ల యుగంధర్ తదితరులు పాల్గొన్నారు