ఏలూరుజిల్లా బుట్టాయిగూడెం దొరమామిడి గ్రామంలో
ప్రజా హెల్త్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో స్థానిక హై స్కూల్ నందు ఈనెల మార్చి 16 తేదీన పదవతరగతి విద్యార్థులు పబ్లిక్ ఎగ్జామ్స్ రాస్తున్న దృష్ట్యా విద్యార్థులకు పుస్తకాలు ప్యాడ్లు పెన్నులు సర్టిఫికెట్ ఫైల్స్ సంబంధించి కిట్లు బుట్టాయిగూడెం ఎస్.ఐ డి.మహేశ్వరరావు చేతులమీదుగా అందజేయడం జరిగింది
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్క విద్యార్థి చదువుతోనే ఉన్నత శిఖరాలను అధిరోహించుతారని ప్రతి విద్యార్థి భవిష్యత్తులో మరింత ఉన్నత స్థితికి చేరాలని అది ఒక్క చదువు తోనే సాధ్యమని ఆయన అన్నారు
ప్రజా హెల్త్ ఫౌండేషన్ అధ్యక్షులు కడిమి రాజేష్ కుమార్ చేస్తున్న సేవలు అభినందనీయమని అన్నారు
ప్రజా హెల్త్ ఫౌండేషన్ అధ్యక్షులు కడిమి రాజేష్ కుమార్ మాట్లాడుతూ ప్రతి ఒక్క విద్యార్థి చదువుకు పేదరికం అడ్డు రాకూడదనే సంకల్పంతో పాఠశాలల్లో ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నామని భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలు చేస్తామని భవిష్యత్ లో మరిన్ని మంచి కార్యక్రమాలు చేస్తామన్నారు ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ సభ్యులు దారా రాజు సింగంశెట్టి మనోహర్ నార్లపాటి రాంబాబు పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు


