సావిత్రిబాయి పేరుతో ప్రభుత్వమే ఒక డిగ్రీ కాలేజ్ ఏర్పాటు చేయాలి,

 సావిత్రిబాయి పేరుతో ప్రభుత్వమే ఒక డిగ్రీ కాలేజ్ ఏర్పాటు చేయాలి



కృష్ణాజిల్లా గన్నవరం_______
 భారతదేశంలో శతాబ్దాలుగా కొనసాగిన విద్యపై విధించిన ఆంక్షలు.భారతదేశంలోని పూర్వపుశాస్త్రాలు,సంప్రదాయాలు వలన స్త్రీలు చదవకూడదు అనేదానికి  బిన్నంగా సావిత్రి భాయిపూలే అనేక ఇబ్బందులు పడి చేసిన త్యాగాలు పలితంగా  భారతదేశంలో మహిళలకు  విద్య, అందిందని దాని కోన సాగింపులోనే నేటి కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు గుర్తించి మండలానికి ఒక మహిళ డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలని ఈ రోజు గన్నవరం వైఎస్ఆర్ పార్టీ వంశీ గారి కార్యాలయంలో వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షుడు నీలం బాలు అధ్యక్షతన  జరిగిన సావిత్రి భాయిపూలే వర్ధంతి సభలో గన్నవరం జెడ్పీటీసీ అన్నవరపు ఎలిజబెత్ రాణి అన్నారు.ఈ సందరబంగా ఆమే మాట్లాడుతూ 
గౌతమ బుద్ధుడు నుండి మహాత్మా జ్యోతిరావు పూలే, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, పెరియార్ వరకు అనేక మహనీయులు విద్య, సమానత్వం, స్వాభిమానానికి ఉద్యమించారు.అందులో భాగంగానే మహాత్మా జ్యోతిరావు పూలే తన భార్య సావిత్రిబాయిపూలేనుభారతదేశపుతొలిమహిళాఉపాధ్యాయురాలిగా తీర్చిదిద్దారు.ఇది ఆధునిక భారతదేశ చరిత్రలో ఒకగొప్పసామాజికవిప్లవం.సావిత్రిబాయి పూలే గారు 1831 జనవరి 3న మహారాష్ట్రలోని సతారా జిల్లా ఖండాలా తాలూకా నైగాన్ గ్రామంలో జగదేవ్ పాటిల్ దంపతులకు జన్మించారు.ఆమేపికు ఎనిమిదేళ్ల వయసులోనే జ్యోతిరావు గోవిందరావు పూలేతో బాల్య వివాహం జరిగింది.
ఆ కాలంలో భారతదేశంలో బాలికలకు విద్య దాదాపు నిషేధితమే.అలాంటి సమయంలో1848లోపూనేలోనిబుధ్వార్‌పేటలోఅతిశూద్రబాలబాలికలకోసంజ్యోతిరావు పూలేమొదటిపాఠశాలను ప్రారంభించారు.ఆపాఠశాలలో సావిత్రిబాయి పూలే మొదటి మహిళాఉపాధ్యాయురాలిగాపనిచేశారు.సమాజంలోని కొందరు తీవ్రంగా వ్యతిరేకించి
ఆమేపై రాళ్లు,మట్టి,పేడ కూడా విసిరినా సావిత్రిబాయి వెనక్కి తగ్గలేదు.చదువు కోసం, సమానత్వం కోసం, మహిళల గౌరవం కోసం ఆమె పోరాటం కొనసాగింది.
అందుకే ఆమేనుచదువుల తల్లి భారతదేశపుతొలి మహిళా ఉపాధ్యాయురాలు
అని గౌరవంగా పిలుస్తారు
మహిళల విముక్తి కోసం,
 ఆమే చేసిన సేవలు భారత చరిత్రలో నేటికైన గుర్తించి సావిత్రి భాయి గారి పేరుతో మండలానికి ఒక మహిళ డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ లకు ఆమే విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో పార్టీ ఆపీస్ కార్యదర్శివెంకటేశ్వరరావు, దిప్,ప్రకాశరావు, వెంకటేశ్వరావు, ఈదా పద్మ, కూనపూరెడ్డి రజిని,రాజేశ్వరి, దుర్గమ్మ, వెంకటేశ్వరమ్మ, సుజి తదితరులు పాల్గొన్నారు.