ఏలూరు జిల్లా, నూజివీడు నియోజకవర్గం,రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని ఆగిరిపల్లిలో సామరస్యానికి ప్రతీకగా ఆత్మీయ ఇఫ్తార్ విందు నిర్వహించారు. పల్లగాని నాగబాబు, కల్పన దంపతులు ఉపవాసంలో ఉన్న ముస్లిం సోదరులకు ప్రత్యేకంగా ఇఫ్తార్ విందు ఏర్పాటు చేసి సామాజిక ఐక్యతను చాటిచెప్పారు.
ఈ కార్యక్రమంలో ఆగిరిపల్లి పోలీస్ స్టేషన్ ఎస్సై శుభ శేఖర్ స్వయంగా పాల్గొని ఉపవాస ముస్లిం సోదరులకు వడ్డన చేయడం విశేషంగా నిలిచింది. ఆయన సేవాభావంతో విందు కార్యక్రమంలో పాల్గొనడం అక్కడున్న వారిని ఆకట్టుకుంది.
ఈ సందర్భంగా పలువురు ముస్లిం పెద్దలు మాట్లాడుతూ, రంజాన్ పవిత్ర మాసంలో ఇలాంటి ఆత్మీయ కార్యక్రమాలు సామాజిక సౌహార్దాన్ని పెంపొందిస్తాయని అన్నారు. పల్లగాని నాగబాబు, కల్పన దంపతుల సేవా భావాన్ని వారు అభినందించారు.
కార్యక్రమంలో స్థానిక ప్రముఖులు, ముస్లిం సోదరులు, యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఇఫ్తార్ విందును ఆనందంగా స్వీకరించారు.


