తూర్పు గోదావరి జిల్లా,గోకవరం:
కూటమి ప్రభుత్వం గద్దెనెక్కి సుమారుగా రెండు సంవత్సరాలు కాబోతున్నప్పటికిని పెన్షనర్స్, రిటైర్డ్ ఉద్యోగుల సమస్యలను పట్టించుకోకుండా గాలికొదిలేచిందని,వారు అయోమయ స్థితిలో ఉన్నారని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ మాదిగ వెల్ఫేర్ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్, ప్రస్తుత వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ "పెన్షనర్స్ & రిటైర్డ్ ఉద్యోగుల రాష్ట్ర కార్యదర్శి కండెల్ల పెద్దిరాజు గుమ్మల్లదొడ్డి ఆయన స్వగృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ పెన్షనర్స్ & ఉద్యోగులకు సంబందించిన పెండింగులో ఉన్న నాలుగు డిఏ(డియర్నెస్ అలవెన్సులు) / డి ఆర్ (డియర్నెస్ రిలీఫ్) సుమారుగా 30 వేల కోట్ల రూపాయలు పెండింగులో బకాయిలు ఉన్నాయని,11వపి. ఆర్. సి చచెల్లింపులు అమలు చేయక పోగా, 12వ పే కమిషన్ ఏర్పాటు "ఐ ఆర్" (ఇంటెరిమ్ రిలీఫ్) అమలు చేసే ఆలోచన ఉన్నట్లు కనిపించడం లేదని, ఆవేదనలలో పెన్షనర్లు, ఆందోళనలలో ఉద్యోగులు ఉన్నారని ఆయన కూటమి ప్రభుత్వానికి గుర్తు చేసారు.
నిమ్మకు నీరెత్తినట్లు ఉన్న కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ఉద్యోగ,పెన్షనర్ల కు ఇచ్చిన హామీలను అమలు చేసే ఆలోచనే లేక పోవడం కడు శోచననీయం అన్నారు.ఈ పరిస్థితుల్లో ఉద్యమమే శరణ్యమా అన్నట్టుందని, రాష్ట్రంలో ప్రతి ఉద్యోగి ప్రతి పెన్షనర్ తమ తమ ఉద్యోగ పెన్షనర్ల బకాయిలు చెల్లింపు ఉమ్మడి సమస్యలు తొందరలో తీర్చని తరుణంలో రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం పై ఉమ్మడి పోరాటానికి సిద్దమయ్యి మరో విప్లవానికి నాంది పలకవలసి ఉంటుందని ఆయన కూటమి ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
11వ పి ఆర్ సి "ఆరియర్స్" చెల్లించలేదు.పిఆర్సీ అనంతరం మంజూరు చేయబడిన డిఏల విషయంలో కూడా రెగ్యులర్ లో కలిపి అరియర్లు చెల్లించకపోవడం,కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇప్పటికీ నాలుగు డిఏ/డి ఆర్ లు బకాయి ఉంచింది.ఉద్యోగ పెన్షనర్ లలో నిరసనల సెగలు నింగికిఎగరకముందే కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను తక్షణం అమలు చేయవలసి ఉన్నదని ఆయన అన్నారు.కూటమి ప్రభుత్వం పెన్షనర్స్,ఉద్యోగుల ఆవేదనను అర్ధం చేసుకుని వీరి అగ్రహానికి గురి కాకముందే తక్షణం బకాయిలు చెలించాలని ఆయన ప్రభుత్వాన్ని హెచ్చరించారు.ఈ కార్యక్రమం లో గోనబోయిన పాండురంగారావు (వై.సి.పి పెన్షనర్స్ & రిటైర్డ్ ఉద్యోగుల నియోజకవర్గం అధ్యక్షులు - నిడదవోలు), జోగి రామకృష్ణ (వై.సి.పి పెన్షనర్స్ & రిటైర్డ్ ఉద్యోగుల నియోజకవర్గం అధ్యక్షులు -గన్నవరం),దువ్వాడ సొల్మానరాజ్ (వై.సి.పి పెన్షనర్స్ & రిటైర్డ్ ఉద్యోగుల నియోజకవర్గం అధ్యక్షులు పిఠాపురం)తదితరులు పాల్గొన్నారు.



