చింతలపూడి నియోజకవర్గంలో డీఎస్సీ 2025 పరీక్షలో విజయం సాధించిన అభ్యర్థులను,
జంగారెడ్డిగూడెం ఆలపాటి గంగ భవాని ఫంక్షన్ హాల్ లో, ఎమ్మెల్యే అధ్యక్షతన ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు
గురువులు సమాజానికి ఆదర్శమని చింతలపూడి ఎమ్మెల్యే రోషన్ కుమార్ అన్నారు.
నాటి వైసీపీ ప్రభుత్వంలో గురువులపై కక్ష సాధింపులకు పాల్పడితే
మన కూటమి ప్రభుత్వం మెగా డీఎస్సీ తీసి ఇచ్చిన మాట నిలబెట్టుకుని నూతన ఉపాధ్యాయులను నియమించిందని అన్నారు.
జంగారెడ్డిగూడెం,ఏలూరు జిల్లా:
ఏలూరుజిల్లా జంగారెడ్డిగూడెం గురువులు సమాజానికి ఆదర్శమని, ఎమ్మెల్యే రోషన్ కుమార్ అన్నారు. నాటి వైసీపీ ప్రభుత్వంలో గురువులపై కక్షసాధింపు చర్యలకు పాల్పడితే, మన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మన ప్రియతమ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ మెగా డీఎస్సీ నిర్వహించి రాష్ట్రంలో నూతన ఉపాధ్యాయులను నియమించారని అన్నారు. శనివారం జంగారెడ్డిగూడెం పట్టణంలోని ఆలపాటి గంగ భవాని ఫంక్షన్ హాల్ నందు ఎమ్మెల్యే ఆధ్వర్యంలో చింతలపూడి నియోజకవర్గంలో డీఎస్సీలో విజయం సాధించి ఉపాధ్యాయులుగా నియమితులైన వారిని ఎమ్మెల్యే జ్ఞాపకాలు తోపాటు సాలువలతో సత్కరించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి, ఎమ్మెల్యే మాట్లాడుతూ అన్ని వృత్తుల్లో నాకు అత్యంత ఇష్టమైనది ఉపాధ్యాయ వృత్తి అని, ఒక ఉపాధ్యాయుడు సమాజాన్ని తీర్చిదిద్దగలరని విద్యార్థులను ఉన్నత శిఖరాలకు చేర్చగలరని మన చింతలపూడి నియోజకవర్గంలో.150.మంది కొత్త ఉపాధ్యాయులు ఎంపిక కావడం పూర్వజన్మ సుకృతం మీరందరూ ఉత్తమ ఉపాధ్యాయులకు నిలిచి విద్యార్థులకు వెలుగులు నిచ్చే మార్గదర్శకులుగా నిలవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ లతోపాటు ఉపాధ్యులతోపాటు నాలుగు మండలాల కూటమి నాయకులు రాష్ట్ర నాయకులు జిల్లా నాయకులు గ్రామ నాయకులు వరకు పాల్గొన్నారు.



