Subscribe Us

header ads

ఉపాధ్యాయ నియామకాల ద్వారా ఇచ్చిన మాట నిలబెట్టుకున్న సీఎం చంద్రబాబు


తూర్పుగోదావరిజిల్లా :

తూర్పుగోదావరిజిల్లా కొవ్వూరు నియోజకవర్గలో 53 మంది మెగా డి ఎస్సి ద్వారా టీచర్స్ పోస్ట్ సాధించారు - కొవ్వూరు నియోజకవర్గం శాసనసభ్యులు ముప్పిడి వెంకటేశ్వరరావు.

గత వైసీపీ ప్రభుత్వంలో ఒక్క ఉపాధ్యాయ నియామకం జరగలేదు

1994 నుంచి 2025 వరకు 14 డీఎస్సీల ద్వారా 1,96,619 టీచర్ పోస్టులను భర్తీ చేసిన ఘనత చంద్రబాబు దే.

కూటమి ప్రభుత్వ విద్యారంగాన్ని బలోపేతం చేయడమే కాక, ఉపాధ్యాయ నియామకాలు ద్వారా నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించిన సీఎంకు ధన్యవాదాలు.

మెగా డిఎస్సి ద్వారా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తానని ఎన్నికలకు ముందు యిచ్చిన హామీని ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టగానే నెరవేర్చి చంద్రబాబు నాయుడు 

మాట నిలబెట్టుకున్నారన్నారు. కొవ్వూరు నియోజకవర్గంలో డీఎస్సీ నియామకాల ద్వారా ఉపాధ్యాయులుగా ఎంపికైన 53 మందిని కొవ్వూరు లోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఘనంగా సత్కరించిన కొవ్వూరు నియోజకవర్గం శాసనసభ్యులు ముప్పిడి వెంకటేశ్వరరావు ఈ కార్యక్రమంలో టుమెన్ కమిటీ సభ్యులు, ఎన్డియే కూటమి నాయకులు, ఎం ఈ ఓ లు పాల్గొన్నారు.

ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ రాష్ట వ్యాప్తంగా 15 వేల 941 మంది ఉపాధ్యాయులుగా ఎంపికైతే కొవ్వూరు నియోజకవర్గం నుంచి 53 మంది కొత్తగా ఉపాధ్యాయ ఉద్యోగాలు పొందారన్నారు. కేవలం 150 రోజులలోనే డి ఎస్సి ఎంపిక ప్రక్రియ పూర్తి చేసేలా చొరవ చూపిన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ని ధన్యవాదాలు తెలియజేసారు.. 1994 నుంచి 2025 వరకు గత 31 సంవత్సరాల్లో 14 డీఎస్సీలను ప్రకటించడం ద్వారా 1,96,619 టీచర్ పోస్టులను భర్తీ చేసిన ఘనత కూటమి ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. అయిదేళ్ల పాలనలో గత ప్రభుత్వం ఒక్క టీచర్ పోస్టును కూడా భర్తీ చేయలేదన్నారు. డి ఎస్సి పై చిత్తశుద్ధితో ఉన్న మంత్రి లోకేష్ అధికారులకు ఎప్పటికప్పుడు దిశానిర్దేశం చేస్తూ విజయవంతంగా ఉపాధ్యాయ నియామక ప్రక్రియ పూర్తయ్యేలా చేశారన్నారు.

కార్పొరేట్ విద్యా రంగంతో పోటీ పడేలా ప్రభుత్వ విద్యా రంగాన్ని తీర్చిదిద్దాలన్న ఏకైక లక్ష్యంతో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అహర్నిశలు కృషి చేస్తున్నారు.  

విద్యా వ్యవస్థలో నాణ్యతా ప్రమాణాలు పెంచుతూనే వేలాది మంది నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కు ఈ సందర్బంగా కృతజ్ఞతలు తెలిపారు.