Subscribe Us

header ads

ఆటో డ్రైవర్ల సంక్షేమానికి ప్రభుత్వం కృషి యార్లగడ్డ




కృష్ణాజిల్లా, గన్నవరం :

ఆటో డ్రైవర్ల సంక్షేమానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తుందని ప్రభుత్వ విప్, గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు భరోసా ఇచ్చారు. శనివారం ఉదయం గన్నవరంలో ఆటో డ్రైవర్ల సేవలో కార్యక్రమాన్ని యార్లగడ్డ ప్రారంభించారు. ఈ సందర్భంగా కేసరపల్లి గ్రామం నుంచి గన్నవరం వరకు ఆటోడ్రైవర్లు ఆటోలతో ర్యాలీ నిర్వహించగా ఎమ్మెల్యే వెంకట్రావు ఆటో నడిపి డ్రైవర్లను, కార్యకర్తలు ఉత్సాహపరిచారు. ఈసందర్బంగా గన్నవరం నియోజకవర్గంలోని ఈ పధకం లబ్ధిదారులైన 2,470 మంది ఆటోడ్రైవర్లకు రూ. 3.70 కోట్ల చెక్ ను ఎమ్మెల్యే చేతులమీదుగా అందచేశారు. ఈ సందర్భంగా యార్లగడ్డ మాట్లాడుతూ కూటమి పార్టీలు ఎన్నికల్లో ఇచ్చిన సూపర్ సిక్స్ పథకాల అమల్లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు ఉచిత బస్సు సౌకర్యాన్ని కల్పించామని ఈ పథకం వల్ల ఆటోడ్రైవర్లకు కలిగిన ఇబ్బందిని గుర్తించి వారిని ఆదుకునేందుకు సంవత్సరానికి రూ.15వేలు చొప్పున ఎకౌంట్లో జమ చేస్తున్నట్లు వివరించారు. 

ఈ పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా 2.9 లక్షల మంది లబ్ధిదారులకు రూ.436 కోట్లు డ్రైవర్ అకౌంట్లో జమ చేస్తున్నట్లు చెప్పారు. ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నప్పటికీ అన్ని వర్గాల ప్రజల సంక్షేమ ధ్యేయంగా ప్రభుత్వం పని చేస్తున్నట్లు ఎమ్మెల్యే వెంకట్రావు తెలిపారు. ఒకవైపు అభివృద్ధి మరోవైపు సంక్షేమ పథకాలను అమలు చేస్తూ వీటికి నిధుల కోసం సంపద సృష్టిస్తూ ముందుకు సాగుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబుకు ప్రతి ఒక్కరూ మద్దతు నివ్వాలని కోరారు. అమరావతి నిర్మాణాన్ని వేగావంతం చేయటంతోపాటు వచ్చే ఏడాది చివరికి పోలవరం పూర్తి చేయాలని లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తున్నట్లు యార్లగడ్డ వివరించారు. గన్నవరం నియోజకవర్గంను మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దేందుకు శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్నట్లు యార్లగడ్డ ఎమ్మెల్యే వెంకట్రావు చెప్పారు. తాను చేస్తున్న ఈ ప్రయత్నానికి నియోజకవర్గ ప్రజలందరూ సహకరించాలని కోరారు.