తూర్పుగోదావరిజిల్లా, కొవ్వూరు :
తూర్పుగోదావరిజిల్లా కొవ్వూరు ఆటో రిక్షా, మ్యాక్సీ క్యాబ్, మోటార్ క్యాబ్ ల డ్రైవర్లకు ఏటా రూ. 15,000 ఆర్థిక సాయం. రాష్ట్రవ్యాప్తంగా 2.90 లక్షల మందికి రూ.436 కోట్ల లబ్ధి
కొవ్వూరు నియోజకవర్గంలో 1336 మందికి గాను 2 కోట్లు లబ్ధి చేకూరింది.
ఆటో డ్రైవర్ల సేవలో కార్యక్రమం లో భాగంగా ఈరోజు కొవ్వూరులో కొవ్వూరు నియోజకవర్గం శాసనసభ్యులు ముప్పిడి వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయం నుండి విజయ విహార్ సెంటర్ మీదుగా లీటరరీ క్లబ్ వరకు ఆటో ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పెద్దఎత్తున కూటమి నాయకులు, కార్యకర్తలు, ఆటో డ్రైవర్ లు పాల్గొన్నారు.
ఈ సందర్బంగా లీటరరీ క్లబ్ లో ఏర్పాటు చేసిన సభలో శాసనసభ్యులవారు మాట్లాడుతూ ఆటో డ్రైవర్ల సంక్షేమం కోసం కూటమి ప్రభుత్వం అందిస్తున్న కానుకగా ఆటో డ్రైవర్ల సేవలో పథకాన్ని కూటమి ప్రభుత్వం చేపట్టిందని. ఎన్నికల్లో ఇవ్వని హామీని నెరవేర్చినందుకు సీఎం చంద్రబాబునాయుడుకు ఆటో డ్రైవర్ల తరపున ధన్యవాదాలు తెలియజేసారు.
ప్రభుత్వ విధానాల విషయంలో గత ప్రభుత్వానికి , కూటమి ప్రభుత్వానికి తేడా గమనించాలని సూచించారు. కూటమి ప్రభుత్వం ఆటో డ్రైవర్ల సేవలో పథకం ద్వారా ఆటో డ్రైవర్ల సంక్షేమం కోసం చేస్తున్న కృషిని వివరించారు. ఆటోలో తమ ప్రయాణ అనుభూతులను గుర్తు చేసుకున్నారు. అదే విధంగా కూటమి ప్రభుత్వం రాష్ట్రాన్ని అభివృద్ధి, సంక్షేమ పథంలో ముందుకు తీసుకెళ్తుందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వం వర్ధిల్లాలని నినదించారు.



