Subscribe Us

header ads

ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్న ఏకైక ముఖ్యమంత్రి చంద్రబాబు... ఎమ్మెల్యే వర్ల



కృష్ణ జిల్లా,పామర్రు:

వాహన మిత్ర పథకం ద్వారా ఆటో డ్రైవర్లను ఆదుకున్న ఏకైక ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అని పామర్రు నియోజకవర్గ శాసనసభ్యులు వర్ల కుమార్ రాజా పేర్కొన్నారు. పామర్రు మార్కెట్ యార్డ్ నందు శనివారం ఆటో డ్రైవర్ల సేవ కార్యక్రమంలో పామర్రు నియోజకవర్గ శాసనసభ్యులు వర్ల కుమార్ రాజా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వాహన మిత్ర పథకం ద్వారా ఆటో డ్రైవర్లను కూటమి ప్రభుత్వం ఆదుకుంటుందని ఆయన అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఆటో డ్రైవర్లను ఆదుకోవాలని ముందు చూపుతో దసరా నుండి ప్రతి సంవత్సరం 15 వేల రూపాయలు అందిస్తామని ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు. ఇందులో భాగంగా ఆటో వాహనదారులకు దసరా కానుకగా 15 వేల రూపాయలు వారి ఖాతాలలో జమ చేస్తున్నామని తెలియజేశారు.

 ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తూ ముందుకు వెళుతున్న ఏకైక ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో పామర్రు నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ తాడిశెట్టి నరేష్, రాష్ట్ర సాంస్కృతిక అకాడమీ చైర్మన్ గుమ్మడి గోపాలకృష్ణ, రాష్ట్ర గౌడ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ వీరంకి వెంకట గురుమూర్తి, రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ డైరెక్టర్ లింగమనేని రామలింగేశ్వర రావు, కృష్ణాజిల్లా ప్రాజెక్ట్ కమిటీ వైస్ చైర్మన్ వల్లూరుపల్లి గణేష్, పామర్రు ఏ.ఎం.సి చైర్మన్ శోభన్ బాబు, ప్రాజెక్ట్ డైరెక్టర్ డి.డబ్ల్యూ.ఎం.ఏ శివప్రసాద్ యాదవ్, జిల్లా స్థాయి అధికారులు, కూటమి నాయకులు, కార్యకర్తలు, ఆటో యూనియన్ సంఘాల నాయకులు, డ్రైవర్లు, మొదలగువారు పాల్గొన్నారు.