సభలో పాల్గొన్న
రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్
విజయవాడ పార్లమెంటు సభ్యులు కేశినేని చిన్ని
విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం శాసనసభ్యులు బొండా ఉమామహేశ్వరరావు
జిల్లా కలెక్టర్లు అధికారులు
విజయవాడ:
విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం అజిత్ సింగ్ నగర్ మాకినేని బసవ పున్నమయ్య స్టేడియంలో ఆటో డ్రైవ ర్ల సేవలో ప్రభుత్వ పథకాన్ని ప్రారంభించడానికి సింగి నగర్ ఆటోలో రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు మరియు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఆటోలో ప్రయాణించినారు దాన్లో భాగంగా జనసేన టిడిపి పార్టీలు నాయకులు కార్యకర్తలు విడివిడిగా జిందాబాద్ లో కొట్టటం విశేషం ఒక ప్రక్క జనసేన పార్టీ వర్ధిల్లాలని మరో ప్రక్క తెలుగుదేశం పార్టీ జిందాబాద్ బోండా ఉమా నాయకత్వం వర్ధిల్లాలని హార హోరిగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయకత్వం వర్ధిల్లాలని నినాదాలు చేసినారు.
ఈ సందర్భంగా సభలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ స్వయం శక్తితో ఎదిగే శ్రమజీవికి ప్రభుత్వం చేయూత ఇవ్వాలని ఉద్దేశంతో నెర వేరు తున్న మరో హామీ ఆటో డ్రైవర్ సేవలో భాగమని ఆటో రిక్షా మ్యాక్స్ క్యాబ్ మోటర్ క్యాప్ డ్రైవర్లకు ఏడాదికి 15000 రూపాయలు ఆర్థిక సహాయం అందిస్తున్నట్లు తెలియజేశారు రాష్ట్రంలోని 2,90,669 మంది డ్రైవర్లను గుర్తించామని ఆటో డ్రై వర్ల సేవలు పథకానికి ప్రతి సంవత్సరం 436 కోట్ల ఖర్చు అవుతుందని అర్హులైన వారు లబ్ధి దారు జాబితాలో పేరు లేకపోతే సమస్యను పరిష్కరించి వారిని ల బ్ధిదారి జాబితాలో చేర్చడం జరుగుతుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు.
విజయవాడ దసరా పండుగకు విజయనగరం నుండి విజయవాడ కు మహిళలు బస్సులపై ఉచిత ప్రయాణం చేసి వచ్చారని మహిళలు ఎంతో ఆనందంగా ఈ పథకాన్ని సద్విని చేసుకున్నారని అదేవిధంగా ఆటో వాళ్లకు ఉపాధి పోకుండా ప్రతి సంవత్సరం 15000 రూపాయలు అందజేస్తామని తెలియజేశారు సూపర్ సిక్స్ పథకాలన్నీ హామీలన్నీ నెరవేర్చమని ప్రజలందరూ కూటమి ప్రభుత్వంలో ఎంతో సంతోషంగా ఉన్నారని ప్రజల కోసం అనేక పరిశ్రమలు వస్తాయని యువతకు ఉపాధి కల్పిస్తామని మహిళలకు రుణాలు అందిస్తామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ సంతోషంగా ఉండాలని ప్రభుత్వం హామీలను నెరవేరుస్తుందని తెలియజేశారు ఈ కార్యక్రమంలో రాష్ట్రం విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేసినేని చిన్ని సెంట్రల్ నియోజకవర్గం శాసనసభ్యులు బొండా ఉమామహేశ్వరరావు జిల్లా కలెక్టర్లు అధికారులు పోలీస్ సిబ్బంది మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు



