Subscribe Us

header ads

ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్యను అందించాలి యార్లగడ్డ


 
కృష్ణాజిల్లా,గన్నవరం

 ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్యను అందించేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలని ప్రభుత్వ విప్ గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు సూచించారు. విజయవాడ రూరల్ మండలం పాతపాడు ఎంపీపీ పాఠశాలలో ఉపాధ్యాయులు సక్రమంగా పాఠాలు బోధించడం లేదంటూ వచ్చిన ఆరోపణలపై స్పందించిన యార్లగడ్డ తక్షణమే విచారణ జరిపి నివేదిక సమర్పించాలని విజయవాడ రూరల్ ఎంఈఓ ఏ. సూరిబాబును ఆదేశించారు. ఎమ్మెల్యే ఆదేశాల మేరకు పాఠశాలను ఆకస్మిక తనిఖీ చేసిన ఎంఈఓ మధ్యాహ్న భోజన పథకం అమలు తీరును, విద్యార్థుల హాజరును, పరిశీలించిన ఆయన విద్యార్థుల్లో అభ్యాసన సామర్ధ్యాన్ని పరీక్షించి విచారణ నివేదికను ఎమ్మెల్యే వెంకట్రావ్కు అందజేశారు. 

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ విద్యార్థుల హాజరు పెంచేందుకు ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో పాఠాలు బోధించాలని, ప్రతి ఒక్క విద్యార్థి పై వ్యక్తిగత శ్రద్ధ తీసుకొని వారిని ఉన్నత పౌరులుగా తీర్చిదిద్దేందుకు ఉపాధ్యాయులు శక్తివంచన లేకుండా కృషి చేయాలని కోరారు. గన్నవరం నియోజకవర్గం లోని ప్రభుత్వ పాఠశాలల్లో ఎప్పటికప్పుడు ఆకస్మిక తనిఖీలు నిర్వహించి విద్యా ప్రమాణాలు మెరుగుపరచేందుకు చర్యలు తీసుకోవాలని విద్యాశాఖ ఉన్నతాధికారులకు సూచించారు. తమ పిల్లల విద్యావున్నతి కోసం తల్లిదండ్రులు తగిన సమయం కేటాయించాలని యార్లగడ్డ ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు.