Subscribe Us

header ads

గర్భిణీలు బాలింతలు పౌష్టికాహారం తీసుకోవాలి


 
నల్లజర్ల,తూర్పు గోదావరి జిల్లా :

తూర్పు గోదావరి జిల్లా లోని నల్లజర్ల గ్రామంలో 8వ రాష్ట్రీయ పోషణ మాసం - 2025 కార్యక్రమాన్ని అంగన్వాడి డిపార్ట్మెంట్ వారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో గోపాలపురం శాసనసభ్యులు గౌరవనీయులు మద్దిపాటి వెంకట రాజు ముఖ్య అతిథులుగా పాల్గొనడం జరిగింది. 

ఆయన మాట్లాడుతూ గర్భిణీలు మానసిక ప్రశాంతత, శారీరకంగా ఉల్లాసంగా ఉండి పౌష్టిక ఆహారాన్ని తీసుకోవడం ద్వారా గర్భంలో పెరుగుతున్న శిశువు పెరుగుదల బావుంటుందని అన్నారు. అలాగే గర్భంలో ఉన్నప్పుడు బయట ఉన్నటువంటి పరిస్థితులు బిడ్డ పుట్టిన తర్వాత ప్రభావితం చేస్తాయని తెలియజేశారు. 

కావున గర్భిణీలు మరియు బాలింతలు మానసికంగా పరిపక్వతతో ఉండి ప్రశాంతంగా ఉంటూ మంచి పౌష్టికి ఆహారం తీసుకోవాలని, వారికి పౌష్టికాహారాన్ని మానసిక ప్రశాంతతను అంగన్వాడి ఉద్యోగులు ద్వారా అందించాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ చైర్మన్ యద్దనపూడి బ్రహ్మ రాజు, మండల పార్టీ ప్రెసిడెంట్ తాతిన సత్యనారాయణ, ఎలమాటి శ్రీనివాస్,, భేతిన దుర్గారావు, మరియు అంగన్వాడి ఉద్యోగులు పాల్గొన్నారు.