Subscribe Us

header ads

జగ్గంపేట లో జరిగిన "ఓట్ చోర్ - గద్దె చోడ్" కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర మాజీ మంత్రి,CWC సభ్యులు డాక్టర్ MM పల్లం రాజు


 
తూర్పు గోదావరి జిల్లా,గోకవరం:

కేంద్ర ఎన్నికల సంఘం రాజ్యాంగ వ్యతిరేకంగా అక్రమాలకు పాల్పడి, ఓటు చోరీకి సహకరించి బిజెపి విజయానికి సహకరించిన తీరుపట్ల నిరసన వ్యక్తం చేస్తూ దేశవ్యాప్తంగా చేపట్టిన ఓట్ చోర్ గద్దె చోడ్ కార్యక్రమంలో భాగంగా కాకినాడ జిల్లా DCC అధ్యక్షులు మాదేపల్లి సత్యానందరావు అదేశాల మేరకు జగ్గంపేట నియోజకవర్గం లో జగ్గంపేట నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ మరోతి శివ గణేష్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఓట్ చోర్ గద్దె చోడ్ కార్యక్రమంలో సి డబ్ల్యూ సి సభ్యులు డాక్టర్ ఎం ఎం పల్లంరాజు పాల్గొని స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్ సెంటర్ నుండి దేవి సెంటర్ వరకు వ్యాపారస్తులు, ఆటో కార్మికులు,తోపుడుబండ్ల వర్తకులు,ప్రయాణికులు తదితరులకు కార్యక్రమం ఉద్దేశించి ప్రచారం చేస్తూ రాహుల్ గాంధీ గారికి మద్దతుగా,బిజెపి మరియు కేంద్ర ఎన్నికల సంఘం సంయుక్తంగా అమలు చేస్తున్న ఓటు చోరీ విధానానికి వ్యతిరేకంగా ప్రజల వద్ద నుండి సంతకాల సేకరణ చేశారు.

ఈ సందర్భంగా పల్లం రాజు మాట్లాడుతూ భారతదేశ ప్రతి పౌరుడు యొక్క స్వేచ్ఛ స్వాతంత్ర్యాలను కాపాడేది భారత రాజ్యాంగ నిర్మాణంలో భాగమైన ప్రజాస్వామ్య వ్యవస్థ అని అన్నారు.ప్రజాస్వామ్య వ్యవస్థ ప్రతి పౌరుడికి ఇచ్చిన ఓటు హక్కు ద్వారా మాత్రమే స్వేచ్ఛ స్వతంత్రం సాధికారిక సాధ్యమవుతాయని,అటువంటి ఓటు హక్కును హరించడం దొంగతనం చేయడం వల్ల ప్రజలందరూ ముఖ్యంగా పేద బడుగు బలహీన వర్గాల ప్రజలు తమ హక్కులను శక్తిని కోల్పోతారని గుర్తు చేశారు. కాబట్టి ఓట్ చోరీకి పాల్పడిన బిజెపి మరియు ఎన్నికల సంఘంపై పోరాడుతున్న రాహుల్ గాంధీ గారికి మద్దతుగా ప్రజాభిప్రాయ సేకరణ సంతకాలు ప్రజాస్వామ్య వ్యవస్థకు మద్దతుగా భావించడం కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని అన్నారు. కార్యక్రమానికి సహకరించిన జగ్గంపేట ప్రజలకు మీడియా మిత్రులకు పల్లం రాజు ధన్యవాదాలు తెలియజేశారు.

ఈ సందర్భంగా జగ్గంపేట నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి మరోతి శివ గణేష్ మాట్లాడుతూ బిజెపి మరియు కేంద్ర ఎన్నికల సంఘం సంయుక్తంగా చేసిన ఓట్ చోరీ అనే ఓట్ల దొంగతనం కార్యక్రమాన్ని ప్రజల్లో ప్రచారం చేసి వారికి వ్యతిరేకంగా 50వేల సంతకాలు జగ్గంపేట నియోజకవర్గం నుంచి సేకరిస్తామని ఈ సందర్భంగా తెలియజేశారు.ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు మాదేపల్లి సత్యానందరావు,ఏఐసీసీ సభ్యులు మల్లిపూడి శ్రీరామచంద్రమూర్తి అనే రాంబాబు,పిసిసి సభ్యులు మరియు జగ్గంపేట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ వత్సవాయి సత్యనారాయణ రాజు అనే బాబు,గోకవరం కిర్లంపూడి గండేపల్లి మండలాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గుర్రాల రత్నాజీ రావు బుద్ధ యతిరాజులు నేదురి భాస్కరరావు,జగ్గంపేట బ్లాక్ వన్ బ్లాక్ టు అధ్యక్షులు చంద్రమౌళి వెంకటరత్నం అనే చిన్నారి,బొల్లం బాపిరాజు, గోకవరం మండలం యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు ఏగుపాటి మహేష్,జిల్లా కాంగ్రెస్ ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి జోడ చైతన్య మరియు కాంగ్రెస్ పార్టీ అభిమానులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.