ఏపీ వ్యవసాయ సహకార సంఘాల ఉద్యోగుల పోరాటానికి మద్దతుగా లిబరేషన్.

 ఏపీ వ్యవసాయ సహకార సంఘాల ఉద్యోగుల పోరాటానికి మద్దతుగా లిబరేషన్.


ఆంధ్రప్రదేశ్ వ్యవసా య సహకార సంఘాల ఉద్యోగుల యూనియన్ జేఏసీ ఆధ్వర్యంలో ఐదు రోజులుగా నిర్వ హిస్తున్న నిరవధిక దీక్ష శిబిరాన్ని సిపిఐ ఎం.ఎల్ లిబరేషన్ ఏలూరు జిల్లా కార్య దర్శి దుర్గం పుల్లారావు సందర్శించి వారికి సిపిఐ ఎంఎల్ లిబరే షన్ పూర్తి మద్దతు నిస్తున్నట్లు తెలిపారు. ఈ సంద ర్భంగా ఆయ న మాట్లాడుతూ కేంద్రం లో బిజెపి ప్రభుత్వం  రాష్ట్రలో కూటమి ప్రభు త్వం ఉద్యోగాలు కల్పి స్తామని అధికారంలోకి వచ్చి ఉన్న ఉద్యోగాల ని తొలగిస్తున్నారని విమర్శించారు. కేంద్రంలో మోడీ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుండి ప్రభుత్వ రంగ సంస్థలని ఎలా ప్రైవేటీ కరిస్తున్నదో వివరించారు.వ్యవసాయ సహకార సంఘ ఉద్యోగస్తులు గొంతెమ కోర్కెలు కోరడం లేదని, వారివి న్యాయమైన కోర్కెలని అన్నారు.గత చంద్రబాబు ప్రభు త్వం తెచ్చిన జీవోని అమలు చేసి 2019 తరువాత జాయిన్ అయిన ఉద్యో గస్తుల ను రెగ్యులర్ చేయాలి అన్న న్యాయ మైన డిమాండ్లు ప్రభు త్వం పరిస్కరించాల్చిన బాద్యత కూటమి ప్రభుత్వం పై ఉన్నదని వెంటనే పరిష్కరించా లని డిమాండ్ చేసారు
 పోరాటం ద్వారా మాత్ర మే న్యాయమైన డిమాండ్లు సాధించు కోగలమని, వ్యవసాయ సహకార ఉద్యోగుల పోరాటానికి లిబరేషన్  ఎప్పుడు అండగా నిలబడుతుందనితుందని హమీ నిచ్చారు.