తలశిల రఘురాం తండ్రి మృతి: కుటుంబ సభ్యులను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే మేకా ప్రతాప్ అప్పారావు
విజయవాడ/గొల్లపూడి: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ శ్రీ తలశిల రఘురాం తండ్రి తలశిల చంద్రశేఖరరావు (88) గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ బుధవారం కన్నుమూశారు. ఈ విషయం తెలుసుకున్న నూజివీడు నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు శ్రీ మేకా వెంకట ప్రతాప్ అప్పారావు విజయవాడ గొల్లపూడిలోని రఘురాం నివాసానికి చేరుకున్నారు.
తలశిల రఘురాంను మరియు వారి కుటుంబ సభ్యులను పరామర్శించి, ధైర్యం చెప్పారు. రఘురాం కుటుంబానికి ఇది తీరని లోటని పేర్కొంటూ, వారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.


