పేద పిల్లలు ఐఏఎస్, ఐపీఎస్, ఇంజనీర్లు, డాక్టర్లు కావాలన్నదే సీఎం చంద్రబాబు నాయుడు లక్ష్యం


పేద పిల్లలు ఐఏఎస్, ఐపీఎస్, ఇంజనీర్లు, డాక్టర్లు కావాలన్నదే సీఎం చంద్రబాబు నాయుడు లక్ష్యం

పి 4 ద్వారా రాష్ట్రంలో పేదరిక నిర్మూలనకు సీఎం చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నారు 

అంబేద్కర్ స్పూర్తితో కష్టపడి చదివి జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగాలి

కృషి, పట్టుదల, సంకల్పం ఉంటే దేన్నయినా సాధించగలం

మంత్రి డా.డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి 

అమరావతి :పేద పిల్లలు ఐఏఎస్, ఐపీఎస్, ఇంజనీర్లు, డాక్టర్లు కావాలన్నదే సీఎం చంద్రబాబు నాయుడు లక్ష్యమని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డా. డోలా బాల వీరాంజనేయస్వామి అన్నారు. గురువారం నాడు అమరావతిలోని తాడేపల్లి ఎస్సీ కార్పోరేషన్ కార్యాలయంలో సివిల్స్ ఉచిత ఆన్లైన్ శిక్షణను మంత్రి ప్రారంభించారు. ఎస్సి కార్పొరేషన్ ఆధ్వర్యంలో సివిల్స్ కి ప్రిపేర్ అయ్యే ఎస్సీ అభ్యర్థులకు ఉచితంగా ఫిజిక్స్ వాలా ఆన్లైన్ కోచింగ్ తో పాటు ట్యాబులు, మెటీరియల్స్ పంపిణీ చేయనున్నారు.

 ఈ సంధర్బంగా మంత్రి మాట్లాడుతూ.... గత వైసీపీ ప్రభుత్వం అంబేద్కర్ స్టడీ సర్కిల్ ని నిర్వీర్యం చేసింది. నేడు స్టడీ సర్కిల్ ద్వారా విజయవాడ, విశాఖ, తిరుపతి కేంద్రాలుగా సివిల్స్ కి ఉచిత రెసిడెన్షియల్ శిక్షణ ఇస్తున్నాం. రెసిడెన్షియల్ సివిల్స్ శిక్షణకు అర్హత సాధించలేని అభ్యర్థులకు ఉచితంగా ఆన్ లైన్ శిక్షణ ఇస్తున్నాం. పేద పిల్లలు ఐఏఎస్, ఐపీఎస్, ఇంజనీర్లు, డాక్టర్లు కావాలన్నదే సీఎం చంద్రబాబు నాయుడు లక్ష్యం. మీకు ప్రభుత్వం కల్సిస్తున్న అవకాశాలు అందిపుచ్చుకుని అంబేద్కర్ స్పూర్తితో కష్టపడి చదివి జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగాలి. కృషి, పట్టుదల, సంకల్పం ఉంటే దేన్నయినా సాధించగలం. పేద పిల్లల సంక్షేమం, ఆరోగ్యంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రత్యేక శ్రద్ద పెట్టారు. డా. బిఆర్ అంబేద్కర్ గురుకులాల్లో ఐఐటీ నీట్ ఎక్సలెన్సీ సెంటర్లు 3 నుంచి 10 కి పెంచాం.

 గత ఏడాది ఐఐటీ నీట్ లో సీట్లు సాధించిన 57 మంది విద్యార్దులకు ఒక్కొక్కిరికి రూ. 1 లక్ష చొప్పున ఆర్దిక సాయం అందించాం. ఈ ఏడాది ఐఐటీ, నీట్ లో మరింత ఎక్కువ మంది సీట్లు సాధిస్తారు. ఎక్సలెన్సీ సెంటర్లు కూడా మరిన్ని పెంచుతాం. పి 4 ద్వారా రాష్ట్రంలో పేదరిక నిర్మూలనకు సీఎం చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నారని

మంత్రి డా.డోలా బాల వీరాంజనేయస్వామి అన్నారు.