పిల్లల కడుపు కొడుతున్న కస్తూర్బా గాంధీ హాస్టల్ యాజమాన్యం

 పిల్లల కడుపు కొడుతున్న కస్తూర్బా గాంధీ హాస్టల్ యాజమాన్యం

ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గం రెడ్డిగూడెం మండలం రంగాపురం గ్రామంలో కస్తూర్బా గాంధీ పాఠశాలలో పిల్లలకు వండి పట్టాల్సిన బియ్యం అక్రమంగా పక్కదారి పడుతున్నాయని రాబడిన సమాచారంతో బుధవారం రాత్రి   తహసిల్దార్ జె. సుశీల దేవి, పిడిఎస్ డిటి శివ నాగరాజు, ఎంఈఓ పి. రమేష్ .  అకస్మాతిక తనిఖీలు చేశారు. 
ఈ తనిఖీల్లో  680 కేజీల పిడిఎస్ బియ్యం అక్రమంగా నిల్వవించారని గుర్తించారు. అభియాన్ని సీజ్ చేసి 17వ నెంబర్ రేషన్ షాపుకు పంపినట్లు తహసిల్దార్  తెలిపారు. 
గతంలో ఇదే హాస్టల్లో పిల్లల్ని చిత్రహింసలు పెట్టి మోకాళ్లు పుండులు పడేలా ఎండలో మోకాళ్లు చేయించారు. 
మరియు పండగ సెలవులు ముగించుకొని పిల్లలు హాస్టల్ కి లేటుగా వెళ్తే 500 నుంచి 1000 రూపాయల వరకు డబ్బులు వసూలు చేశారని ఆరోపణలు కూడా వినిపించాయి. 
ఇప్పుడు చూస్తే పిల్లలకు కడుపునిండా పెట్టాల్సిన బియ్యాన్ని అక్రమంగా నిల్వ ఉంచి వాటిని అమ్ముకొని డబ్బు సంపాదిస్తున్నారని తెలుస్తుంది. 
పిల్లల కడుపు కొట్టి సంపాదిస్తే ఆ డబ్బులు ఏరకంగా వంట పడతాయి అనేది వాళ్ళకే తెలియాలి.
ఇంతటి అక్రమాలకు పాల్పడుతున్న హాస్టల్ యజమానిపై ఉన్నత అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని. పిల్లలు, తల్లిదండ్రులే కాక గ్రామస్తులు కూడా కోరుతున్నారు.