ముస్లిం సోదర, సోదరీమణులందరికీ రంజాన్ నెల ప్రారంభోత్సవ శుభాకాంక్షలు తెలిపిన ఎంపీ.
పవిత్ర రంజాన్ మాసం ప్రారంభం సందర్భంగా ఏలూరు పార్లమెంటు పరిధిలోని ముస్లిం సోదర, సోదరీమణులకు ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ శుభాకాంక్షలు తెలిపారు. నెల రోజుల పాటు నియమ నిష్ఠలతో కఠిన ఉపవాసాలు పాటిస్తూ ముస్లిం సోదరులు చేసే ప్రార్థనలు ఫలించాలని, వారి కుటుంబాలతో పాటు రాష్ట్ర ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండే విధంగా అల్లా దీవెనలు లభించాలని కోరుకుంటున్నట్లు ఎంపీ బుధవారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు. దుష్ట శక్తులను పారద్రోలి, సమాజంలో సుఖ శాంతులు, సౌభ్రాతృత్వం పెంపొందాలని భగవంతుని ప్రార్ధించాల్సిందిగా ఎంపీ కోరారు.


