రామకృష్ణ పరమహంస జయంతి

 రామకృష్ణ పరమహంస జయంతి


ఏలూరు జిల్లా ,అప్పన్న వీడు జడ్పీ హైస్కూల్లో

మానవసేవ ద్వారానే మాధవ సేవ లభిస్తుందని తాను నమ్మి ఆచరించి చూపించిన గొప్ప ఆధ్యాత్మిక వేత్తే రామకృష్ణ పరమహంస అని మద్దాయి కుంట జడ్పీ హైస్కూల్ ప్రధానోపాధ్యాయులు దారపురెడ్డి భాస్కరరావు విద్యార్థులకు వివరించారు గొప్ప ఆధ్యాత్మికవేత్త కాళీమాత భక్తుడుగా స్వామి వివేకానంద కి గొప్ప గురువుగా వ్యవహరించిన సేవా తత్పరుడు కలకత్తాలో జన్మించి భారతదేశమంతా తన అద్వైత సిద్ధాంతం ద్వారా దేవుడు ఒక్కడే నని, అన్ని మతాల సారం ఒక్కటేనని ఇతరులకు సేవ చేయటం ద్వారానే దైవత్వం లభిస్తుందని తెలియజేసిన వ్యక్తి రామకృష్ణ పరమహంసఅని నేటి విద్యార్థులందరూ సేవాభావాన్ని ఆయన జీవిత చరిత్ర నుంచి అలవర్చుకోవాలని భాస్కర్ రావు సూచించారు.