శాసనసభ సమావేశంలో పాల్గొన్న కొవ్వూరు నియోజకవర్గ శాసనసభ్యులు ముప్పిడి వెంకటేశ్వర రావు..

 శాసనసభ సమావేశంలో పాల్గొన్న కొవ్వూరు నియోజకవర్గ శాసనసభ్యులు ముప్పిడి వెంకటేశ్వర రావు.. 


తూర్పుగోదావరిజిల్లా కొవ్వూరు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  ముఖ్యమంత్రి  నారా చంద్రబాబు నాయుడు, తేదీ 01-07-2025న కొవ్వూరు అసెంబ్లీ నియోజకవర్గంలో పర్యటించినప్పుడు కొవ్వూరులోని CHC ని 50 పడకల నుండి 150 పడకల ఏరియా ఆసుపత్రి గా అప్‌గ్రేడ్ చేస్తానని హామీ ఇచ్చారని... తాళ్లపూడి మండలం, చాగల్లు మండలం, కొవ్వూరు మండలం, నిడదవోలు మండలం, పోలవరం మండలం, దేవరపల్లి మండలం, గోపాలపురం మండలం మరియు నల్లజర్ల మండలంలోని గ్రామాలకు సంబందించి తూర్పు గోదావరి జిల్లాలో ప్రస్తుతం జిల్లా ఆసుపత్రి లేదని తెలిపారు. జాతీయ రహదారి 16, జాతీయ రహదారి 5 కొవ్వూరు పట్టణానికి దగ్గరగా ఉన్నాయని, పోలవరం ప్రాజెక్టు అభివృద్ధితో, కొవ్వూరు ఆసుపత్రిలో సేవలను పొందే రోగుల సంఖ్య పెరిగిందని, కానీ కొవ్వూరు ఆసుపత్రిలో తగినంత మంది సిబ్బంది లేకపోవడం వల్ల రోగులు ఇబ్బందులకు గురవుతున్నారని, వారు మరింతగా వైద్య పరీక్షల కోసం రాజమండ్రిలోని జీజీహెచ్‌కు వెళ్లాల్సి వస్తుందని ఆయన పేర్కొన్నారు. తగినంత మంది సిబ్బంది లేకపోవడం వల్ల, చాలాసార్లు రోగులు రాజమండ్రిలోని జీజీహెచ్‌కు వెళ్లాల్సి వస్తుందని ఆయన అన్నారు. 2027 లో గోదావరి పుష్కరాలు సజావుగా సాగడానికి CT స్కాన్, MRI వంటి సౌకర్యాలతో కూడిన మల్టీ స్పెషాలిటీ ప్రభుత్వ ఆసుపత్రి అవసరమని అలాగే ట్రామా సెంటర్ (Trauma Centre)  ప్రమాదాలు, తీవ్రమైన గాయాలు  లేదా ప్రాణాపాయ స్థితిలో ఉన్న రోగులకు అత్యవసర చికిత్స అందించే ప్రత్యేక ఆసుపత్రి విభాగం ఏర్పాటు చేయాలని కోరారు.