న్యూ జనరేషన్ సంస్థలో నారాయణ గారి జన్మదిన వేడుకలు,
ఎన్టీఆర్ జిల్లా,
విజయవాడ వన్ టౌన్, భవన్నారాయణ వీధి దగ్గరలో న్యూ జనరేషన్ యూనిటీ ఆర్గనైజేషన్ కార్యాలయం నందు ఘనంగా కీర్తిశేషులు గొడ్డంటి నారాయణరావు జన్మదిన వేడుకలు నిర్వహించినారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా వ్యాపారవేత బాలాజీ స్వీట్స్ అధినేత కన్నమర్లపూడి సుబ్బారావు, తెలుగుదేశం పార్టీ యువ నాయకులు ధీటి ప్రభుదాస్ 48,49 డివిజన్ల క్లస్టర్ ఇంచార్జ్ పాల్గొని పరీక్ష సమయంలో పిల్లలు ఒత్తిడిని జయించాలని ఒక ముందస్తు ప్రణాళికగా చదువులు ఏకాగ్రతతో పాఠాలు అర్థం చేసుకొని చదవగలిగితే విజయం వరిస్తుందని పేద విద్యార్థిని విద్యార్థులకు సూచిస్తూ ఇంటర్ మరియు 10వ తరగతి విద్యార్థిని విద్యార్థులకు మంచిగా మార్కులు సాధించాలని ఆకాశిస్తూ ముందుగా శుభాకాంక్షలు అందించినారు అనంతరం విద్యార్థిని విద్యార్థులకు సరస్వతి పూజలో పెట్టిన పెన్నులు, పరీక్ష ప్యాడ్లు, పుస్తక బ్యాగులు అందించినారు సంస్థ చేస్తున్న ఉచిత విద్య కార్యక్రమాలు పై వివరిస్తూ సభ్యులందరికీ ప్రత్యేకంగా ప్రశంసిస్తూ ముఖ్యంగా సంస్థ వ్యవస్థాపక కార్యదర్శి సాయి వినయ్ కుమార్ తన తండ్రి జన్మదిన ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా "పితృదేవోభవ" అనే కార్యక్రమం నిర్వహిస్తూ విద్యార్థినీ విద్యార్థుల చదువుకు సహకరిస్తూ పరీక్ష సమయంలో పలువురు అతిథులను పిలిపించి వారికి మార్గదర్శన సూచనలు అందిస్తూ పరీక్ష వాటి సమయంలో తీసుకోవాల్సిన సమయపాలన జాగ్రత్తలను పాటించాలని ప్రత్యేక అవగాహన సదస్సు ఈ విధంగా తన తండ్రి ఆశీర్వాదంగా నిర్వహిస్తున్నారని పోలీస్ వ్యవస్థలో చిరు ఉద్యోగి అయినప్పటికీ తను చేస్తున్న కృషి ఎంతోమందికి ఆదర్శనీయమని అటువంటి వ్యక్తిని ప్రతి ఒక్కరూ గౌరవిస్తూ ఆదర్శంగా నిలుపుతూ సంస్థకు తోడుగా నిలవాలని ప్రముఖులు అభిలాషించారు ఈ కార్యక్రమాన్ని సంస్థ ఉపాధ్యాయురాలు జయలక్ష్మి, ప్రజ్వల హోం మల్లికా, సంస్థ సభ్యుడు గౌతం పర్యవేక్షిస్తూ కార్యక్రమం విజయవంతం చేసినారు.


