ఆధ్యాత్మిక శక్తి ప్రతి ఒక్కరూ ఏర్పరచుకోవాలి..




ఏలూరు జిల్లా, నూజివీడు నియోజకవర్గం, ఆగిరిపల్లి లో ఆధ్యాత్మిక శక్తి బలబడినప్పుడే ప్రపంచ శాంతి ఏర్పడుతుందని రామాంజనేయ గోష్టి ప్రధాన నిర్వాహకులు తాండవ కృష్ణ పేర్కొన్నారు. ఆదివారం స్థానిక శోభనాచల స్వామి వారి ఆలయంలో నూజివీడు శ్రీ రామాంజనేయ గోష్టి సభ్యుల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ ప్రజల్లో భక్తి భావం పెంపొందించేందుకు త్రివిధస్కూల్ నిర్వాహకులు శ్రీనివాసరావు ఉదయలక్ష్మి దంపతులు శ్రీపతి స్తుతి మాల అని పుస్తకాన్ని గోస్ట్ సభ్యులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో డివిఆర్ దంపతులు ఉపాధ్యాయుని మహాలక్ష్మి శ్రీదేవి తదితరులు భక్తి భావం పెంపొందించే విషయాలను తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పలువురు గోష్టి సభ్యులు భక్తులు పాల్గొన్నారు.