ఎంపీ  పుట్ట  మహేష్ చిత్రపటానికి పాలాభిషేకం 

కూటమి ప్రభుత్వంతోనే గ్రామీణ ప్రాంతాలు అభివృద్ధి  చెందుతున్నాయని  జనసేన పార్టీ నాయకులు వాడపల్లి రమేష్ పేర్కొన్నారు. గంగవరం గ్రామంలో ఎన్టీఆర్ విగ్రహం వద్ద ఎంపీ పుట్టా మహేష్ చిత్రపటానికి టిడిపి , జనసేన, పార్టీల నాయకులు రాధాకృష్ణ, వాడపల్లి రమేష్ ల ఆధ్వర్యంలో పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా రాధాకృష్ణ మాట్లాడుతూ మండలంలో గంగవరం , మూడు పుంతలు, మంగపతి దేవి పాలెం  గ్రామాల వరకు 2  ధశాబ్దాల కాలం నుండి రోడ్డు నిర్మించాలని పలుమార్లు ప్రభుత్వ అధికారులు చుట్టూ, రాజకీయ నాయకులు చుట్టూ తిరిగినప్పటికీ ఫలితం లేక ఎదురుచూస్తున్న సమయంలో కూటమి ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తరువాత ఏలూరు పార్లమెంట్ సభ్యులు పుట్టా మహేష్ కుమార్ తమ గ్రామానికి 92 లక్షల రూపాయల తొ బీటీ రోడ్డు నిర్మించడానికి ఆదేశాలు జారీ చేశారని ఆయన తెలిపారు. వాడపల్లి రమేష్ మాట్లాడుతూ  గత నెలలో రాజవరం జిల్లా పరిషత్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఏ ఐ కంప్యూటర్ ల్యాబ్ ప్రారంభానికి విచ్చేసిన ఎంపీ మహేష్ ను తమ గ్రామస్తులు కలిసి రహదారి నిర్మించాలని కోరడంతో ఆయన వెంటనే స్పందించి రోడ్డు నిర్మాణానికి ఆదేశాలు జారీ చేశారని తెలిపారు. టిడిపి సీనియర్ నాయకులు జాలాది చంద్రం మాట్లాడుతూ తమ గ్రామం నుండి పట్టణాలకు వెళ్లాలంటే రహదారి అంతా గోతులతో దర్శనమిస్తూ, వర్షాకాలంలో బురద మట్టితో  ఇబ్బందులు పడేవారమని, కుటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంపీ పుట్ట మహేష్, రహదారి నిర్మించడానికి ఆదేశాలు జారీ చేయడం పట్ల  హర్షం వ్యక్తం చేస్తున్నామని అన్నారు. నూతన రహదారి నిర్మించడానికి కృషిచేసిన ముఖ్యమంత్రి చంద్రబాబుకు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు, పోలవరం నియోజకవర్గ శాసనసభ్యులు చిర్రి బాలరాజుకు, ట్రై కర్  చైర్మన్ బొరగం శ్రీనివాస్ కు, మండల పార్టీ అధ్యక్షులు పారేపల్లి రామారావు కు, కూటమి పార్టీల నాయకులకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కోన కుమార్, బల్లె కేసు బాబు, చిన్నంశెట్టి కిరణ్, చంద్ర మహేష్, కలిదిండి రాజేష్, ఈడుపుగంటి భాస్కర్, కండెల్లి అనిల్, తదితరులు పాల్గొన్నారు.