పదవ తరగతిలో ఎక్కువ మార్కులు సాధించిన విద్యార్థులకు షైనింగ్ స్టార్ అవార్డ్స్ విద్యాశాఖ అధికారి మడకం రామన్న...
ఏలూరుజిల్లా కొయ్యలగూడెం డివిజన్ ఉప విద్యాశాఖాధికారి మడకం రామన్న దొర బుట్టాయిగూడెం హై స్కూల్ ప్లస్ ని సందర్శించి అక్కడ పదో తరగతి మరియు ఇంటర్మీడియట్ చదువుతున్నటువంటి విద్యార్థుల యొక్క ప్రగతిని పరిశీలించడం జరిగింది. ఉపాధ్యాయుల యొక్క పనితీరుని మరియు విద్యార్థుల యొక్క హాజరును పరిశీలించడం జరిగింది.100 డే యాక్షన్ ప్లాన్ అమలు విధానాన్ని అడిగి తెలుసుకున్నారు. షైనింగ్ స్టార్స్ పదో తరగతిలో అత్యధిక మార్కులు సాధించడానికి మంచి సలహాలు అందించడం జరిగింది మరియు రైజింగ్ స్టార్స్ అందరు ఉత్తీర్ణత సాధించడానికి పాటించవలసిన నియమాలను, మంచి ఆరోగ్య జాగ్రత్తలను, పరీక్షలు ఎదుర్కోవటానికి అవసరమైన మానసిక నైపుణ్యాలను తెలియపరచడం జరిగింది. ఆ తదుపరి సోమవారం
నుంచిప్రారంభించబడుతున్నటువంటి ఇంటర్మీడియట్ పరీక్షల నిమిత్తం కూడా ఇంటర్ విద్యార్థులకు మార్గ నిర్దేశం చేసి వారికి హాల్ టికెట్లను పరీక్షా సామాగ్రిని అందించడం జరిగింది. వీరితో పాటు మండల విద్యాశాఖ అధికారులు తెల్లం బాబురావు ,సిహెచ్ నరేందర్ రాయ్ మరియు ప్రధానోపాధ్యాయులు కోర్స సుబ్బలక్ష్మి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.


