ఘనంగాఛత్రపతి శివాజీ జయంతి వేడుకలు,
ఏలూరు జిల్లా నూజివీడు మండలం మద్దికుంట జిల్లా పరిషత్ హై స్కూల్ నందు దారపు రెడ్డి భాస్కరరావు ఆధ్వర్యంలో మహారాష్ట్ర హైందవ నిర్మాత చత్రపతి శివాజీ గురువారం జయంతి వేడుకలు నిర్వహించారు ఈ సందర్భంగా భాస్కర్ రావు మాట్లాడుతూ చత్రపతి శివాజీ మహారాష్ట్ర రాజ్యంలో జన్మించారు చిన్ననాటి నుంచి తన తల్లి జిజియా బాయ్ మార్గదర్శకత్వంలో గొప్ప వీర చరిత్ర కలిగిన నాయకుల జీవితాలను బాగా అర్థం చేసుకుని భయమే తెలియని గొప్ప వీరుడుగా మహమ్మదీయ మతానికి వ్యతిరేకంగా అన్ని మతాలు సమానమే అని తెలియజేస్తూ, ఎన్నో యుద్ధాల్లో పాల్గొని మొఘలుల ను ఎదిరించిన గొప్ప భారతీయుడే శివాజీ మనందరికి ఆదర్శనీయమని, 1674లో రాయగడ కోటలో చత్రపతి అనే బిరుదును మిగిలిన రాజ్యాల రాజులందరూకలిసి ఆయనకు పట్టాభిషేకం చేశారు తన తండ్రి సైన్యం కంటే ఎక్కువ సైన్యాన్ని, రాజ్య విస్తరణను బాగా విస్తరించి తన రాజ్య ప్రజలకు సేవలు అందించిన ధైర్యశాలి ఛత్రపతి శివాజీ మీరంతా ఆయన జీవితాన్ని చదివి మంచి లక్షణాలు అలవాటు చేసుకోవాలని విద్యార్థులకు భాస్కర్ రావు వివరించారు.


