ఘనంగా అపర్ణ సమేత అనంతేశ్వరస్వామి కళ్యాణం
ఏలూరుజిల్లా జంగారెడ్డిగూడెం మండలం తాడువాయి గ్రామంలో స్వయంభులై వెలసిన భద్రకాళి సమేత వీరేశ్వర స్వామి వారి దేవస్థానంలో మహాశివరాత్రి ఉత్సవాల్లో భాగంగా బుధవారం 4వ రోజు దేవస్థాన ఆవరణలో సీతారాముల కళ్యాణం కనుల పండుగగా దేవస్థాన ఉత్సవ కమిటీ చైర్మన్ ఉప్పునూతల పుల్లారావు, ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కళ్యాణం లో సూరయ్య బంజరు గ్రామానికి చెందిన కన్నం అరవింద్. హరిప్రియ దంపతులు పీటలు పై కూర్చున్నారు. ఈ కార్యక్రమానికి భక్తులు విరివిగా పాల్గొని స్వామివారి కల్యాణాన్ని తిలకించారు. అనంతరం భద్రకాళి సమేత వీరేశ్వరస్వామి ఉపాలయంగా ఉన్న శివాలయంలో అపర్ణ సమేత అనంతేశ్వర స్వామి వారి కళ్యాణం జరిగింది. ఈ కళ్యాణంలో అలవా సేతు మాధవ, దివ్యశ్రీ దంపతులు పీటలపై కూర్చున్నారు.
భక్తులు 4వరోజు స్వామివారిని యధావిధిగా దర్శించుకున్నారు. ఈ సందర్భంగా దేవస్థాన ఉత్సవ కమిటీ చైర్మన్ ఉప్పునూతల పుల్లారావు మాట్లాడుతూ ఈరోజు 4రోజు కార్యక్రమంలో భాగంగా బుధ వారం జరిగిన కార్యక్రమాలు వివరించారు. స్వామివారి కల్యాణ మహోత్సవాల్లో భాగంగా రేపు గురువారం ఆఖరి రోజు స్వామివారికి అమ్మవారికి పుష్ప యాగము (పవళింపు సేవ) స్వామివారికి పూజలు నిర్వహించబడతాయని తెలిపారు. భక్తులు విరివిగా పాల్గొని స్వామిని దర్శించాలని కోరారు. ఆలయం వద్ద రాత్రి సమయంలో నృత్యప్రదర్శన కార్యక్రమాలు ఉంటాయని భక్తులు తిలకించాలని కోరారు. దేవస్థానం వద్ద ఉత్సవ కమిటీ సభ్యులు కళ్యాణ మహోత్సవాలకు వచ్చిన భక్తులకు వసతులు కల్పించారు. 4వరోజు కార్యక్రమాల్లో చైర్మన్ ఉప్పునూతుల పుల్లారావు దంపతులు, పిన్నమనేని నాని దంపతులు, కొడవటి సత్తిరాజు దంపతులు, పాపోలు వెంకట శ్రీనివాసరావు దంపతులు, ఉప్పునూతుల రాఘవేంద్రరావు దంపతులు, ఉప్పునూతుల వెంకటేశ్వరరావు, దంపతులు, ఉప్పునూతుల శ్రీను, దంపతులు, రూప సుధాకర్ దంపతులు, పాల్గొన్నారు.


