శ్రీ నూకాలమ్మ దేవస్థానంలో శుక్రవారం సందర్భంగా విశేష పూజలు

 శ్రీ నూకాలమ్మ దేవస్థానంలో  శుక్రవారం సందర్భంగా విశేష పూజలు

అమ్మ వారి వెండి చీర తయారీకి ద్రవ్యం సమర్పించిన భక్తులు 

ఏలూరుజిల్లా జంగారెడ్డిగూడెం పట్టణంలోని శ్రీనూకాలమ్మ అమ్మ వారు శుక్రవారం సందర్భంగా విశేష అలంకరణలో దర్శనమిచ్చారు.

అమ్మ వారి ఉత్సవ మూర్తికి పంచామృత అభిషేకాలు మూలవిరాట్ కు ఏకాదశ హారతి పూజలు వేద దర్బారు సేవ చతుర్వేద స్వస్తి నీరాజన మహా మంత్ర పుష్పాలతో సాయం సంధ్యా హారతి పూజలు ప్రధాన అర్చకులు కాళ్ళకూరి శంకర మహేష్ శర్మ బృందం నిర్వహించారు.

ఆలయ శాశ్వత చైర్మన్ డాక్టర్ రాజాన సత్యనారాయణ (పండు) ఆలయ కమిటీ చైర్మన్ రొంగల నాగేశ్వరరావులతో కూడిన ఆలయ కమిటీ ఆధ్యర్యంలో అభివృద్ది కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి.

బత్తిన సత్యనారాయణ అరుణ దంపతులు (తాడేపల్లిగూడెం) వెండి చీర తయారీకి 2తులాల వెండి మరియు 

శటగోపం శ్రీనివాస్ తులసి దంపతులు వెండి చీర తయారీకి రూ 5,116/ లు విరాళంగా సమర్పించారని డాక్టర్ రాజాన అన్నారు.

దాతల కుటుంబ సభ్యులను అమ్మ వారు ఎల్లవేళల కాచి కాపాడాలని అన్నారు. 

చిట్లూరి సుబ్బారావు నేతృత్వంలో నూకాంబిక ప్రసాద వితరణ భక్త బృందం సభ్యులు పులిహోర ప్రసాద వితరణ చేశారు.

అమ్మ వారి వెండి చీర తయారీకి వెండి రూపంలో ధన రూపంలోనూ మరియు పాత వెండి వస్తువులు సమర్పించి వెండి చీర తయారీలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ కొమ్మినేని వెంకటరమణ, చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి ఆలయ కమిటీ పోలుపర్తి రాము,రొంగల సత్యనారాయణ, చింతకాయల అచ్చిరాజు, పైల శ్రీను, బూరి కృష్ణ,కోరుపూరి రాంబాబు తదితర పట్టణ ప్రముఖులు, మహిళా కమిటీ సభ్యులు, బాల దుర్గా లలిత పారాయణ మండలి సభ్యులు,సేవా బృందాల సభ్యులు మరియు గ్రామ భక్త మహా జనులు పాల్గొని కార్యక్రమాలను విజయవంతం చేశారనీ ఆలయ మేనేజర్ చిటికెన రాంబాబు తెలియజేశారు.