చాట్రాయిలో సహకార ఉద్యోగస్తులబారీర్యాలీ.

 చాట్రాయిలో సహకార ఉద్యోగస్తులబారీర్యాలీ.


జీవో నెంబర్ 36 సవర ణ చేసి ఇంప్లిమెంట్ చేయాలి. 2019 తర్వాత జాయిన్ అయిన ఉద్యోగస్తులను రెగ్యులర్ చేయాలి.
ఏలూరు జిల్లా మండల కేంద్రమైన చాట్రాయిలో ని సహకార హెడ్ ఆఫీస్ నందు ఆంధ్ర ప్రదేశ్ సహకార సంఘం ఉద్యోగస్తులు (జెఏసి) ఆధ్వర్యంలో నిర్వహి స్తున్న నిరసన దీక్ష శుక్రవారం ఐదో రోజు కూడా కొనసాగింది. శుక్రవారం ఉద్యోగస్తు
లు భారీ ర్యాలీ నిర్వ హించారు. ఈ సంద ర్భంగా సిపిఐ ఏలూరు జిల్లా కార్యవర్గ సభ్యు లు ఎస్ శ్రీనివాసరావు మాట్లాడుతూ 2018లో ఒక జీవో వచ్చిందని ఆ జీవో ఇంప్లిమెంటేషన్ అవ్వ లేదని, ఆ జీవో గత తెలుగుదేశం ప్రభు త్వం లోనే వచ్చిందని ఐదు సంవత్సరాల వైసిపి ప్రభుత్వం అమ లుచేయకుండా కాల యాపన చేసిందని,
అన్నారు. అయితే ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు తెచ్చిన జీవో 36 ను సవరణ చేసి కొనసా గించమని కోరు తున్నామని తెలిపారు. 2019 తర్వాత జాయి న్ అయిన ఉద్యోగుల ను రెగ్యులర్ చెయ్యా లని వయసు పరిమితి 60 నుండి 62 వరకు ప్రభుత్వ ఉద్యోగాలు లాగా కొనసాగించాలని గ్రాడ్యుటి, హెల్త్ ఇన్సూ రెన్స్ ఇంప్లి మెంట్ చేయాలని డిమాండ్ చేశారు. డ్యూటీ చాలరీ స్ తిరిగి కట్టమని ఆడిట్ రిపోర్ట్ లో పెడ తారని, ఆ జీతాల్ని, చేసే పనికి ఆ జీతాల ను తిరిగి కట్టమని ప్రపంచంలో ఎక్కడా లేదని, కానీ మేము ఏ శాలరీస్ అయితే తీసు కున్నామో వాటిని తిరిగి కట్టమని అంటు న్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటువంటి విధానాన్ని తొలగించ మని మేము కోరుతు న్నా మన్నారు. ప్రభుత్వం ప్రభుత్వ అధికారులు కూడా మా న్యాయమైన కోరికల పట్ల సానుకూలంగా ఉన్నారని, ప్రభుత్వం మీద మా వ్యతిరేకత కాదని, సహకార కమి షనర్ మా సమస్య లన్నిటిని పక్కదారి పట్టిస్తూ మమ్ములను కనీసం ఉద్యోగస్తులుగా కాదు కదా మనుషులు గా కూడా చూడటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మా సమస్య లు పరిష్కారం చేస్తా మని మా జేఏసీ నాయకులను అందరిని రమ్మని పిలిచి ఆర్సీఎస్ కమిషనర్ మాకు అపా యింట్మెంట్ ఇవ్వకుం డా చాలా చిన్నచూపు చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మా సమస్యలు పరిష్కారం కాక పోవడానికి కమి షనర్ కారణమని విమర్శించారు. గత సంవత్సరం కాలం నుండి రైతులు ఇబ్బంది పడకూడదనే దశల వారీగా వివిధ రూపాల్లో ఆందోళన సాగిస్తున్నా మన్నారు.ది5-12-2025 నుండి డీసీపీ ల ముందు, జిల్లా  కార్యా లయాల వద్ద ప్రదర్శన లు, మచిలీపట్నం హెడ్ ఆఫీస్ వద్ద పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించడం అన్ని జిల్లాలను కలుపు కొని విజయవాడలో పెద్ద ఎత్తున ధర్నా చౌక్ లో నిరసన తెలపడం, సహకార కమిషనర్ కార్యాలయం వద్ద వంటా వార్పు కార్య క్రమం లాంటి అనేక ఆందోళనలు చేసిన ప్పటికీ పట్టించుకున్న పరిస్థితి కనిపించలేదని అన్నారు. మా న్యాయ మైన సమస్యలు పరి ష్కరించకుంటే మా జేఏసీ నాయకులు పిలుపు మేరకు ఆమరణ నిరాహార దీక్షకు పూనుకుంటా మని సావో రేవో తేల్చుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వివిధ సహకార సంఘాల నాయకులు ఉద్యోగ స్తులు వందలాదిగా పాల్గొన్నారు.