పేదోడి ఆరోగ్యానికి పూర్తి భద్రత కల్పిస్తున్న కూటమి ప్రభుత్వం


 పేదోడి ఆరోగ్యానికి పూర్తి భద్రత కల్పిస్తున్న కూటమి ప్రభుత్వం

  ఆపదలో ఉన్న కుటుంబానికి 55 మంది బాధిత కుటుంబాలకు సుమారు. రూ.28.38.330లక్షల చెక్కులను అందజేసిన రాష్ట్ర మంత్రివర్యులు కొలుసు పార్ధసారధి

రాష్ట్ర ప్రజల మెరుగైన వైద్యానికి చేయూత ముఖ్యమంత్రి సహాయనిది రాష్ట్ర గృహ నిర్మాణ మరియు సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారధి

నూజివీడు :నూజివీడు నియోజకవర్గంలో నూజివీడు
 మండలం ముకొల్లు గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేసిన మంత్రి అనంతరం ఏర్పాటు చేసిన సభలో 55మంది కుటుంబాలకు *సుమారు రూ.28.38..330లక్షల ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను అందజేసిన మంత్రి కొలుసు పార్థసారధి మాట్లాడుతూ... మెరుగైన వైద్యం కోసం నియోజకవర్గ స్థాయిలోని నాలుగు మండలాల్లో ఇటీవల వైద్యం చేయించుకున్న 55మంది బాధిత కుటుంబాలకు సుమారు. రూ.28.38.330 లక్షల ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు పంపిణీ చేసిన మంత్రివర్యులు మాట్లాడుతూ...
ఆపత్కాలంలో ఉన్న నిరు పేదలకు మెరుగైన వైద్యం అందించడంలో ముఖ్యమంత్రి సహాయ నిధి, అండగా నిలుస్తుందని రాష్ట్ర గృహనిర్మాణ,సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు.

రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి సహాయనిధి అండగా నిలుస్తుందన్నారు.రాష్ట్రంలో ఏ ఒక్క పేదవాడు డబ్భులు లేక వైద్యానికి దూరం కాకూడదని ప్రభుత్వం వేల కోట్లు ఖర్చు చేస్తుందన్నారు. రాష్ట్ర పేద ప్రజల పూర్తి ఆరోగ్య భద్రత కూటమి ప్రభుత్వానిదని మంత్రి తెలిపారు.గత ప్రభుత్వం వైద్యాన్ని తుంగలో తొక్కిందని ఒక్కరికి కూడా ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి 1రూ.అయినా అందించలేదని అన్నారు.

 నియోజకవర్గానికి చెందిన పలువురు గతంలో వైద్యం చేయించుకొని ఉన్న బిల్లులను ముఖ్యమంత్రి సహాయ నిధికి అర్జీ చేసుకోవచ్చని అన్నారు.
 గతంలో వైద్యం చేయించుకున్న వారు వైద్యం చేయించుకున్న బిల్లులను మా కార్యాలయంలో అందజేస్తే ముఖ్యమంత్రి సహాయ నిధినుండి ఆర్ధిక సహాయం వెంటనే అందజేస్తానన్నారు.  
మెరుగైన వైద్యానికి కూటమి ప్రభుత్వం వేల కోట్లు ఖర్చు చేస్తుందని ప్రజలంతా దీన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.ప్రభుత్వ ఆసుపత్రులలో మెరుగైన వైద్య పరికరాలు,నిఫుణులైన సిబ్బంది, అందుబాటులో ఉన్నారని ప్రజలంతా మెరుగైన వైద్యాన్ని సద్వినియోగం చెసుకోవలన్నారు.

కూటమి నాయకులు కార్యకర్తలు గ్రామాల్లో వైద్యం చేయించుకున్న వారికి అండగా నిలిచి తెలియని బాధిత కుటుంబాలకు తెలియజేసి ముఖ్యమంత్రి సహాయ నిధికి బిల్లులు అందజేసి ఆపదలో ఉన్న కుటుంబానికి అండగా నిలవాలని చూసించారు.

రాష్ట్ర మంత్రి పార్థసారథికి బాధిత కుటుంబ సభ్యులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
 ఆపదలో ఉన్న మా కుటుంబాన్ని దేవుడి లా ఆదుకొన్నారని ఇలాంటి మంత్రి కి జీవితాంతం రుణపడి ఉంటామని, తమ కృతజ్ఞతను వ్యక్తం చేశారు,ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, తదితరులు పాల్గొన్నారు.