ఎన్టీఆర్ భరోసా జీవితానికి ఒక భరోసా అని చింతలపూడి శాసనసభ్యులు రోషన్ కుమార్ పేర్కొన్నారు
ఏలూరుజిల్లా జంగారెడ్డిగూడెం మండలం శనివారం జంగారెడ్డిగూడెం మండలం కట్టపొదలగూడెం, అమ్మపాలెం గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ వృద్ధులు వితంతువులు వికలాంగులకు ఎమ్మెల్యే రోషన్ కుమార్ పంపిణీ చేశారు. వృద్ధాప్య దశలో ఉన్న వారికి, వికలాంగులకు, వితంతు మహిళలకు ఇతరులపై ఆధారపడకుండా ఈ పెన్షన్ వారి జీవితానికి భరోసా ఇస్తుందని అన్నారు.
ఈ కార్యక్రమంలో జెడ్పిటిసి పొల్నాటి బాబ్జి,మండల అద్యుక్షులు కుక్కల మాధవరావు,కార్యదర్శి భూసా సత్యనారాయణ రెడ్డి, గ్రామ పార్టీ అద్యుక్షులు మేన్ని బాబూరావు,శీలం కృష్ణంరాజు, తదితర నాయకులు, కూటమి నాయకులు,ప్రజా ప్రతినిధులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు


