జర్నలిస్టులకు తక్షణమే ఇళ్ల స్థలాలు కేటాయించాలి,

 జర్నలిస్టులకు తక్షణమే ఇళ్ల స్థలాలు కేటాయించాలి,


ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ కృష్ణాజిల్లా కమిటీ డిమాండ్.

రాష్ట్రవ్యాప్తంగా అర్హులైన జర్నలిస్టులందరికీ తక్షణమే ఇళ్ల స్థలాలు కేటాయించాలని ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (ఎపిడబ్ల్యుజెఎఫ్) కృష్ణాజిల్లా అధ్యక్షుడు జె. వెంకటప్పయ్య, ప్రధాన కార్యదర్శి కార్యదర్శి వై.శ్రీనివాస్, ఉపాధ్యక్షులు ఆర్.అచ్యుతరావు డిమాండ్ చేశారు. జర్నలిస్టుల న్యాయమైన 13 డిమాండ్లను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (ఎపిడబ్ల్యుజెఎఫ్), ఆంధ్రప్రదేశ్ బ్రాడ్ కాస్ట్ జర్నలిస్ట్ అసోసియేషన్ (ఎపిబిజెఎ) రాష్ట్ర కమిటీల పిలుపుమేరకు మార్చి 4న చలో విజయవాడ కార్యక్రమానికి పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. చలో విజయవాడ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరుతూ  గన్నవరంలోని ఎపీఎన్ జివో అసోసియేషన్ కార్యాలయంలో గన్నవరం నియోజకవర్గ ఫెడరేషన్ సమావేశం అధ్యక్షులు ఎస్.బాలస్వామి, కార్యదర్శి ఎం.సురేష్ అధ్యక్షతన శుక్రవారం జరిగింది. ఈ సందర్భంగా వెంకటప్పయ్య, శ్రీనివాస్, అచ్యుతరావు మాట్లాడుతూ జర్నలిస్టుల ఇంటి స్థలాల కేటాయింపు, మీడియా కమిషన్ ఏర్పాటు, పెన్షన్, జర్నలిస్టులు, వారి కుటుంబ సభ్యులకు ఉచిత వైద్యపరీక్షలు, పిల్లలకు ఉచిత విద్య, రైల్వే ప్రయాణంలో రాయితీని పునరుద్ధరించాలనీ, కమిటీల నియామకం, మీడియా అకాడమీకి గవర్నింగ్ కౌన్సిల్ ఏర్పాటు, అవార్డులు, కార్మిక బీమా సదుపాయం కల్పించాలనే తదితర డిమాండ్లతో చలో విజయవాడ కార్యక్రమాన్ని తలపెట్టామన్నారు. రాష్ట్రంలో అపరిష్కృతంగా ఉన్న జర్నలిస్టుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళి వాటిని పరిష్కరించుకునేందుకు ఎపిడబ్ల్యుజెఎఫ్ కృషి చేస్తోందన్నారు. ముఖ్యంగా జర్నలిస్టులకు ఇళ్లస్థలాల కేటాయింపు సమస్య చాలాయేళ్లుగా అపరిష్కఅతంగా ఉందన్నారు. ఎన్నికల సమయంలో జర్నలిస్టులకు ఇంటి స్థలం కేటాయిస్తామని ప్రణాళికలో ప్రకటించడంతో అందరూ ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారన్నారు. జర్నలిజం రక్షణ లేని పఅత్తిగా మారిపోయిందని, ఈనేపథ్యంలో భద్రత, పని పరిస్థితులు, ఇతర సదుపాయాలు తదితర అంశాలన్నింటిపై అధ్యయనం చేసేందుకు మెరుగైన చర్యలు చేపట్టేందుకు వీలుగా ప్రభుత్వం మీడియా కమిషన్ ను ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. దేశంలోని దాదాపు 18 రాష్ట్రాల్లో జర్నలిస్టులకు ఆయా ప్రభుత్వాలు పెన్షన్ పథకాన్ని అమలు చేస్తున్నాయని, మన రాష్ట్రంలో కూడా జర్నలిస్టులకు పెన్షన్ పథకాన్ని అమలు చేయాలని కోరారు. మరణించిన జర్నలిస్టుల కుటుంబాలకు తాత్కాలిక భరోసా కింద ఆర్థిక సాయాన్ని రూ.5వేలకు పెంచాలని డిమాండ్ చేశారు. ఆరోగ్యబీమా ద్వారా ఆరునెలల కొకసారి జర్నలిస్టులకు, వారి కుటుంబ సభ్యులకు ఉచిత వైద్య పరీక్షల సదుపాయం కల్పించాలని కోరారు. పిల్లలకు అన్ని కార్పొరేట్ పాఠశాలలు, కళాశాలల్లో చదువుకునే ఉచిత విద్య అందించాల న్నారు. జర్నలిస్టులపై జరిగే దాడులను అరికట్టేందుకు వీలుగా రాష్ట్రంలో హోంశాఖ మంత్రి నేతత్వంలో హైపవర్ కమిటీ, జిల్లాలో ఉన్నత పోలీసు అధికారులతో కూడిన కమిటీలు వేసేందుకు ఉత్తర్వులు ఉన్నప్పటికీ ఏర్పాటు చేయలేదని తెలిపారు. జర్నలిస్టుల సంక్షేమం కోసం వర్కింగ్ జర్నలిస్టు వెల్ఫేర్ ఫండ్ కమిటీ తక్షణమే పునరుద్ధరించాలని, ఈ కమిటీల ఏర్పాటుకు తగిన చర్యలు తీసుకోవాలని, వర్కింగ్ జర్నలిస్టు వెల్ఫేర్ ఫండ్ రూ.50కోట్లను కేటాయించాలని కోరారు. తొలుత సీనియర్ పాత్రికేయులు డి. ఉదయ కుమార్ సందేశం ఇచ్చారు. ఈ సమావేశంలో ఎపిడబ్యుజెఎఫ్ నాయకులు అజయ్, బాబు,  పి.మహేష్ , ఏడుకొండలు, పవన్, మోహనరావు, సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు.