ఏలూరుజిల్లావార్తలు.
పిజిఆర్ యస్ లో అందిన ప్రతి అర్జీ రీఓపెన్ కాకుండా నాణ్యమైన పరిష్కారం చూపాలి
దరఖాస్తులోని అంశాలపై క్షేత్రస్థాయిలో పరిశీలించాలి
ధరఖాస్తులు పరిష్కారంలో అలసత్వం, నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవు
పిజిఆర్ యస్ లో అందిన అర్జీలు 271.
జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి ...
ఏలూరు,(మంజీరగళం)ప్రతినిధి మార్చి , 09
జిల్లా కలెక్టరేటు గోదావరి సమావేశ మందిరంలో సోమవారం జిల్లా స్థాయి ప్రజాసమస్యలు పరిష్కార వేదిక కార్యక్రమాన్ని జిల్లాస్థాయీ అధికారులతో జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి నిర్వహించారు. జిల్లా కలెక్టరుతో పాటు జిల్లా రెవెన్యూ అధికారి వి.విశ్వేశ్వర రావు, ఆర్డీవో యం.అచ్యుత అంబరీష్, స్పెషల్ డిప్యూటీ కలెక్టరు యల్.దేవకిదేవి, ఎస్సీ కార్పొరేషన్ ఇడి యం.ముక్కంటి, తదితరులు స్వీకరించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి మాట్లాడుతూ పిజిఆర్ యస్ లో అందిన ప్రతి అర్జీ రీఓపెన్ కాకుండా నాణ్యమైన పరిష్కారం చూపాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పిజిఆర్ యస్ లో అందిన దరఖాస్తుల పరిష్కారానికి అత్యంత ప్రాధాన్యతను ఇస్తున్నదని , కావున అధికారులు ధరఖాస్తులో తెలియజేసిన విషయాలపై క్షేత్రస్థాయిలో విచారణ చేసి, నిబంధనల మేరకు పరిష్కరించాలన్నారు. క్షేత్రస్థాయిలో ఉత్పన్నమయ్యే సమస్యలకు క్షేత్రస్థాయిలోనే పరిష్కారం చేసి అర్జీలు రీఓపెన్‌కు ఆస్కారం లేకుండా చూడాలన్నారు. భూ సమస్యలు రెవిన్యూ క్లినిక్ ద్వారా పరిష్కరించుకోవాలని కోరా, అందిన అర్జీలలో కొన్ని.
పెదవేగి మండలం ముండూరు గ్రామానికి చెందిన కాసగాని రమాదేవి తన దరఖాస్తులో తనకు వితంతు పెన్షన్ మంజూరు చేయవలసిందిగా కోరారు. చింతలపూడి మండలం రేచెర్ల గ్రామానికి చెందిన మూడి వెంకటేశ్వరరావు తన దరఖాస్తులో తాను కాన్సర్ తో బాధపడుతున్నానని తనకు పెన్షన్ మంజూరు చేయవలసిందిగా కోరారు. పెదవేగి మండలం దుగ్గిరాల గ్రామానికి చెందిన పోతుల పద్మనాలిని తన దరఖాస్తులో తమ భూమిని 22ఏ జాబితాలో నుండి తొలగించవలసిందిగా కోరారు. దెందులూరు మండలం రామారావుగూడెం నకు చెందిన దాసరి తులసమ్మ తన కొడుకు తన ఇంటిని తీసుకుని తనను వెళ్లిపొమ్మంటున్నాడని తనకు న్యాయం చేయాలి కోరారు. ముదినేపల్లి కి చెందిన ఎన్ . విక్టర్ పాల్ తన దరఖాస్తులో తమ గ్రామంలో చేపల చెరువు యజమాని తన చేపల చెరువులో కలుషిత నీటిని తమ ప్లాట్ లోనికి వదులుతున్నారని తమకు న్యాయం చేయాలనీ కోరారు. పెదవేగి మండలం న్యాయంపల్లికి చెందిన ఎన్ . సలోమి తన దరఖాస్తులో తన భూమిని కృష్ణ అనే వ్యక్తి ఆక్రమించాడని తనకు న్యాయం చేయాలనీ కోరారు. సదరు దరఖాస్తులను పరిశీలించి నిబంధనల మేరకు పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను కలెక్టర్ వెట్రిసెల్వి ఆదేశించారు. సోమవారం జరిగిన పిజిఆర్ యస్ కార్యక్రమంలో 271 అర్జీలు అందాయి.
ఈ కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా అధికారులు, జిల్లా కలెక్టరేటు సూపర్డెంట్లు, తదితర ఉద్యోగులు పాల్గొన్నారు.


