ఘనంగా జనార్ధన వరంలో అతర్జాతీయ మహిళా దినోత్సవం

 ఘనంగా జనార్ధన వరంలో అతర్జాతీయ మహిళా దినోత్సవం

(మంజీరగళం ప్రతినిధి) చాట్రాయి:-

ఏలూరు జిల్లా నూజివీ డు నియోజకవర్గం చాట్రాయి మండలం జనార్ధనవరం గ్రామం లో అఖిలభారత ప్రగతి శీల మహిళా సంఘం (ఐఫ్వా)జిల్లా కార్యదర్శి దుర్గం పూజిత ఆధ్వ ర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఘనంగా జరిగింది. స్వీట్లు, తమ్సప్ డ్రింక్ పంపిణీచేసి ఘనంగా ఉత్సిహ భరితంగా జరుకున్నారు.ఈ సభకు ముఖ్యఅతిథిగా రాష్ట్ర కార్యవర్గ సభ్యు లు పరికళ కళావతి ఏఐసిసి టీ యు రాష్ట్ర గౌరవ అధ్యక్షులు టీ అరుణ, సిపిఐ ఎంఎల్ లిబరేషన్ జిల్లా కార్యద ర్శి దుర్గం పుల్లారావు, రాష్ట్ర కార్యవర్గ సభ్యు లు డి హరినాథ్ హాజ రయ్యారు. డి పూజిత  ప్రసంగిస్తూ అంతర్జా తీయ మహిళా దినోత్స వాన్ని, వేడుకగా కాకుం డా పురుషాధిక్య,భావ జాలానికి వ్యతిరేకంగా ఉద్యమించాలని కార్య కర్తలకు విజ్ఞప్తి చేశారు.                                     మార్చి 8 దేశమంతా మహిళా దినోత్సవాన్ని జరుపుకోవడంలో పోటీ పడే ప్రభుత్వాలు మహి ళల సాధికారిత కల్పిం చడంలో వైఫల్యం చెం దుతున్నాయని,స్వేచ్ఛ ,సమానత్వం ,ప్రజాస్వామ్యం మహిళల హక్కు ల పరిరక్షణ పట్ల ప్రభు త్వంయోక్క బాధ్యత వహించటం లేదని విమర్శించారు.టి అరుణ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఇటీ వల నైట్ షిఫ్ట్ లో కూ డా పనిచేసే విధంగ చట్ట సవరణ తెచ్చార న్నారు. ఓ పి ఎస్ అమ లు చేయాలని డిమాం డ్ చేశారు. ముగ్గురు  పిల్లల్ని కనండి అని ఉద్బోధించే పాలకులు ఆ కుటుంబాల వారి ఆర్థిక పరిస్థితి మెరు గుపడే విధంగా జీవ నోపాధి కలిగే విధంగా పథకాలను రూపొందిం చాలన్నారు.పెరిగిన గ్యాస్ సిలిండర్ ధరలు తగ్గించాలని అరుణ డిమాండ్ చేశారు.లింగ వివక్షత రూపుమాపాల న్నారు.చట్టసభల్లో మహళలు33 శాతం రిజర్వేషన్ బిల్లు ఆమో దించ కుండానే పాలకు లు మోసం చేస్తున్నా రని, పరికల కళావతి ఆవేదన వ్యక్తం చేసా రు.రాష్ట్రపతిగా ద్రౌపదీ ముర్ము ఎన్నిక చేయ టం ద్వారా మహిళా ఉద్ధారకులుగా మోడీ గోబెల్స్ ప్రచారం చేసు కున్నారనీ,మహిళలపై అత్యాచారాలు హత్య లు అరికట్టటంలో వైఫ ల్యం చెందారని అరుణ ఆరోపించారు. ప్రేమ పేరు తో ఇటీవల విద్యా ర్థినులపై అత్యాచా రాలు హత్యలు పేట్రే గిపోతున్నాయని ఆయే షామేర అత్యాచారం హత్య చేసిన దోషుల ను పట్టుకోకుండా సీబీఐ  కూడా ఆధా రాలు లేవని కేసు ఎత్తిషవేయటం బాధాక రమని దుర్గం పూజిత విమర్శించారు.నిర్భయ , దిశ లాంటి చట్టాలు అత్యాచార హత్యల ను, మహిళలపై హిం స ,పరువు హత్యలను నివారించలేక పోతు న్నాయని పరికల కళా వతి ఆరోపించారు. మహిళా దినోత్సవం కాను కగా కేంద్ర ప్రభుత్వంపెంచిన గ్యాస్ ధరలు తగ్గించాలని హరినాథ్ డిమాండ్ చేశారు ప్రభుత్వాలు హింసకు కారణమైన సామాజిక సమస్యలను పరిష్కరించే ప్రయత్నం చేయటం కన్నా నిందితులను కులం, మతం, ఆర్థిక పరిస్థితి ,అధికార దర్పం అడ్డుపెట్టుకొని పెరోల్ లు మంజూరు చేస్తూ దండలు వేసి ఊరేగిస్తున్నారని డిహరినాథ్ విమర్శించారు .సంఘటన జరిగిన ప్రతిసారీ బాధిత కుటుంబం వైపు కాకుండా నిందితుడి పక్షాన నిలబడటం ప్రజాస్వామ్యానికి సిగ్గుచేటని దుర్గం పుల్లారావు విమర్శించారు.