ఏలూరు జిల్లా వార్తలు.
చింతలపూడి -మంజీరాగళం (ప్రతినిధి)
చింతలపూడి మండలం సీతానగరం జిల్లా పరిషత్ హైస్కూల్ నందు 10 వ తరగతి విద్యార్థులకు ఫాడ్లు, విద్యా సామాగ్రీ CI క్రాంతి కుమార్ గారి చేతుల మీదుగా అందించటం జరిగింది.. ఈసందర్భంగా CI క్రాంతి కుమార్ మాట్లాడుతూ కష్టపడి చదివితేనే ఉన్నత స్థాయికి ఎదుగుతారన్నారు. విద్యార్థులు చెడు అలవాట్లకు దూరంగా ఉండాలన్నారు. MEO కిరణ్ బాబు మాట్లాడుతూ సమయాన్ని సద్వినియోగం చేసుకుని ప్రణాళిక ప్రకారం చదవాలన్నారు. దాత కంచర్ల బుచ్చిబాబు మాట్లాడుతూ విద్యార్థుల చదువుకొనసాగించడానికి అన్ని విధాలా సహకరిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.


