తూర్పుగోదావరిజిల్లావార్తలు.

 తూర్పుగోదావరిజిల్లావార్తలు.


గోపాలపురం నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లోని రహదారులను రూపురేఖలు మార్చే విధంగా  ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు  కృషి 

దేవరపల్లి,(మంజీరగళం)ప్రతినిధి మార్చి09.

 తూర్పుగోదావరిజిల్లాదేవరపల్లి పంచాయతీ పరిధిలోని సాస్కి నిధులు రూ. 2.77 కోట్లతో పేరం చెరువు నుంచి అచ్చియ్యపాలెం వరకు సుమారు 5 కిలోమీటర్లు , అచ్చియ్యపాలెం లింక్ రోడ్డు నుంచి బుచ్చియ్యపాలెం వరకు మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధులు  రూ. 62 లక్షలతో గ్రామాల్లో సీసీ, మిగతా ప్రాంతాల్లో బీటీ రహదారులు ఏర్పాటు చేస్తున్నామని ఆయన తెలిపారు.

 అనంతరం పొగాకు క్యూరింగ్, గ్రేడింగ్ పనులను పరిశీలించి మహిళ కూలీలతో మాట్లాడారు...

 గ్రేడింగ్ సమయంలో ఆరోగ్య సమస్యలు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కూలీలకు ఎమ్మెల్యే గారు సూచించారు..

 ఎన్నో ఏళ్ల రోడ్డు కల నెరవేరడంతో అచ్చియ్యపాలెం, బుచ్చియ్యపాలెం పెద్దలు ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు ని సత్కరించారు..