ఏలూరు జిల్లా, చింతలపూడి బోయిగూడెం ఆర్ సి ఎం చర్చి ప్రాంగణంలో హోప్ అండ్ఎబిలిటీ ట్రస్ట్ సాంఘిక సేవా సంస్థ సర్వసభ్య సమావేశం రెవరెండ్ ఫాదర్ మాథ్యూ అధ్యక్షతన జరిగినది .
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా శాసనసభ్యులు శ్రీ సొంగ రోషన్ కుమార్ పాల్గొని
హోప్ అండ్ ఎబిలిటీ ట్రస్ట్ మరియు సాంఘిక సేవా సంస్థ చేస్తున్న సంక్షేమ సేవా కార్యక్రమాలను శాసనసభ్యులు ప్రశంసించారు. ఈ సందర్భంగా సాంఘిక సేవా సంస్థ చైర్మన్ బిషప్ పొలిమేర జయరావ్ చేస్తున్న పలు సేవా కార్యక్రమాలను పలువురు కొనియాడారు. ప్రత్యేక ఆహ్వానితులు కూటమి నాయకులు,
ట్రస్ట్ సభ్యులు శ్రీ అబ్రహం మాస్టర్ రెవరెండ్ ఫాదర్ మరియ కుమార్, శ్రీమతి జయలక్ష్మి ,మరియు సాంఘిక సేవా సిబ్బంది, హోప్ అండ్ ఎబిలిటీ ట్రస్ట్ ప్రెసిడెంట్ ఝాన్సీ, సెక్రటరీ మేరీ పాల్గొని, దివ్యాంగులు ,విభిన్న ప్రతిభావంతులైన 300 మందికి శ్రీ సొంగ రోషన్ కుమార్ చే దుప్పట్లు పంపిణీ చేశారు.


