అన్నదాతలకు అండగా మన కూటమి ప్రభుత్వం. ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు.


అన్నదాతలకు అండగా మన కూటమి ప్రభుత్వం.

ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు. 




ఏలూరుజిల్లా ద్వారకాతిరుమల మండలం జి కొత్తపల్లి గ్రామంలో శుక్రవారం గోపాలపురం నియోజకవర్గం ద్వారకాతిరుమల మండలం జి.కొత్తపల్లి గ్రామంలో “అన్నదాత సుఖీభవ – పీఎం కిసాన్ (రైతన్న మీకోసం)” 2025–26 మూడవ విడత పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది.
ఈ సందర్భంగా రైతులతో మాట్లాడి, ప్రభుత్వం రైతుల సంక్షేమం మరియు వ్యవసాయ అభివృద్ధికి కట్టుబడి ఉందని తెలియజేశాను. రైతులకు సమయానికి ఆర్థిక సహాయం అందించడం ద్వారా వ్యవసాయ పనులు మరింత సులభంగా కొనసాగుతాయని పేర్కొన్నాను.
ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు పరిపాలనలో రైతుల అభ్యున్నతి కోసం అనేక పథకాలు ప్రవేశపెట్టి, అన్నదాతలకు అండగా నిలుస్తూ రైతు సంక్షేమాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు.
అలాగే ప్రభుత్వం అందిస్తున్న వివిధ సంక్షేమ పథకాలపై రైతులకు అవగాహన కల్పించి, అందుబాటులో ఉన్న పథకాలన్నింటిని పూర్తిగా వినియోగించుకోవాలని సూచించాను.
రైతుల అభ్యున్నతే ప్రభుత్వ లక్ష్యం.
ప్రతి రైతు కుటుంబం ఆర్థికంగా బలపడేలా నిరంతరం కృషి కొనసాగుతుంది. 
ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, రైతులు, గ్రామ పెద్దలు మరియు ప్రజలు పాల్గొన్నారు.